మరో మలుపు తిరిగిన గంజాయి కేసు
ఎక్సైజ్ స్టేషన్ ఎదుట తండావాసుల ఆందోళన
అదుపులోకి తీసుకున్న వ్యక్తి పేరు తొలగింపు, విడుదల
తప్పుడు కేసు బనాయించిన అధికారులపై చర్యలు శూన్యం
నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ మండలం కా ల్పోల్ తండాలో గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిపై నమోదు చేసిన కేసు మరో మలుపు తిరిగింది. ఎక్సై జ్ అధికారులు అమాయకుడైన వ్యక్తిని పట్టుకుని అదుపులోకి తీసుకోవటంతో శనివారం తండాకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున నిజామాబాద్ ఎక్సైజ్ స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. చివరికి గ్రామస్తులు ద్వారా నిజాలు తెలుసుకున్న అధికారు లు తమ ఆధీనంలో ఉన్న వ్యక్తిని వదిలిపెట్టారు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు..
తండాలో కొంతమంది గంజాయి సాగుచేస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అరుణ్‌రావు ఆదేశాలతో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆధ్వర్యంలో తండాలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రతిరాం అనే వ్యక్తిని పట్టుకుని విచారణ పేరుతో నిజామాబాద్‌కు తరలించారు. దీంతో శనివారం ఉదయం తండావాసులు ఎక్సైజ్ స్టేషన్‌కు చేరుకుని పశువులు కాసే వ్యక్తికి వ్యవసాయ భూమి లేదని, అటువంటప్పుడు అతను ఎలా గంజాయి సాగుచేస్తాడని అధికారులను ప్రశ్నించారు. అడవిలో పెరిగిన గంజాయి మొక్కలను పీకి వాటిని రతిరాం ఇంటిముందు వేసి అతనే గంజాయి సాగుచేస్తున్నాడని అరెస్టు చేయడం తగదన్నారు. ఎక్సైజ్ శాఖలో పనిచేసే మోహన్‌సింగ్ కాల్పోల్ తండాకు చెందిన వాడని, తామంటే అతనికి గిట్టని ఆయన అక్రమం గా రతిరాంను కేసులో ఇరికించాడని ఆరోపించారు. అలాగే ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏఈఎస్ లక్ష్మణ్‌నాయక్, సీఐ సాదిక్‌లు రతిరాంపై అక్రమంగా కేసులు బనాయించారని నిరసనకు దిగారు. తండావాసులు పె ద్ద ఎత్తున తరలిరావటంతో ఎక్సైజ్ సూపరింటెం డెంట్ గంగారాం ఎక్సైజ్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఎక్సైజ్ స్టేషన్ సీఐ కిష్టయ్య, నగర సీఐ నర్సింగ్‌యాదవ్, 3,4 టౌన్ల ఎస్సైలు శ్రీహరి, నరేష్, స్పెషల్ పార్టీ పోలీసులు అక్కడకు చేరుకుని బందోబస్తు చేపట్టారు. ఈఎస్ గంగారాం శుక్రవారం కాల్పోల్ తండాకు వెళ్లిన అధికారులను పిలిపించి పోలీసులు, తండావాసుల సమక్షంలో జరిగిన విషయం ఏమిటో తెలుసుకున్నారు.
అదుపులో ఉన్న రతిరాంకు ఎలాంటి భూములు లేవని గ్రామస్తులు చెప్పడంతో ఆయనను అధికారులు వదిలిపెట్టారు. సాగులో ఉన్న గంజాయి మొక్కలు ఎవరికి చెందినదో గుర్తించేందుకు గ్రామానికి చెందిన వీఆర్‌ఏను రప్పించారు. ఆయన వద్ద ఉన్న రికార్డుల ప్రకారం అటవీ శాఖకు చెందిన భూమి బన్సీరాంసింగ్ సాగు చేస్తున్నాడని తేలింది. ఆయనపై కేసు నమోదు చేసినట్లు కేసు విచారణ చేపట్టిన నిజామాబాద్ ఎక్సైజ్ స్టేషన్ సీఐ కిష్టయ్య తెలిపారు. అలాగే తండాలో రతావత్ బిక్యా ఇంటిముందు 15 గంజాయి మొక్కలు, బన్సీ సరుతిరాం ఇంటిముందు పెంచుతున్న 25 మొక్కలను పట్టుకుని వాటిని పెంచుతున్న వారిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం వీరిద్దరు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలించి అరెస్టు చేస్తామన్నారు.