
ఏపీ ప్రజలూ ఓ కేసీఆర్‌ను కోరుకుంటున్నారు
తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటల
హైదరాబాద్: రాష్ట్ర విభజనతో తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన వ్యాఖ్యలతో తెలంగాణపై విషం చిమ్ముతూనే ఉన్నారని ఆరోపించారు. హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్న చంద్రబాబు ఇక్కడి ప్రజలను కించపరిచేలా మాట్లాడటం సరికాదన్నారు.
తెలంగాణలో కేసీఆర్ సుపరిపాలన చూస్తున్న ఆంధ్రా ప్రజలు తమ రాష్ట్రంలోనూ ఓ కేసీఆర్ ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో మానవీయ కోణంలో పాలన కొనసాగుతోందని.. దేశంలో అత్యంత వేగంగా రాష్ట్రం అభివృద్ధి సాధిస్తోందని ఈటల తెలిపారు. తెలుగు ప్రజల మధ్య ప్రేమ, ఆప్యాయత ఉండాలని.. అన్నదమ్ముల్లాగా కలసిమెలసి ఉండాలని తాము కోరుకుంటున్నామన్నారు. చౌకబారు వ్యాఖ్యలతో తెలుగు ప్రజల మధ్య సామరస్యం దెబ్బతినేలా చంద్రబాబు వ్యవహరించడం సరికాదన్నారు.