అభివృద్ధిని చూడలేని అంధుడు
⇒ చంద్రబాబుపై మంత్రి ఈటల ధ్వజం
⇒ ఏపీలో ప్రజా విశ్వాసం పొందలేక మొసలి కన్నీరు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల విశ్వాసం పొందలేక టీడీపీ అధినేత చంద్రబాబు మొసలికన్నీరు కారుస్తూ జనాన్ని మభ్యపెడుతున్నారని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. చంద్రబాబును రెండు రాష్ట్రాల ప్రజలు అసహ్యించుకుంటు న్నారని, కేసీఆర్ లాంటి సీఎం కావాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఏపీ, తెలం గాణ విడిపోయి అభివృద్ధి చెందుతున్న తరు ణంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా బాబు మాట్లాడటం అభ్యంతరకరంగా ఉందన్నారు. శుక్రవారం సచివాలయంలో మంత్రి విలేకరు లతో మాట్లాడారు. ‘‘స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏర్పడ్డ చిన్న రాష్ట్రాలే అభివృద్ధిలో ముందున్నాయి. గుజరాత్, ఛత్తీస్‌గఢ్, హరి యాణా.. ఇప్పుడు తెలంగాణ దూసుకుపోతు న్నాయి. అభివృద్ధిని చూడలేని అంధుడు చంద్రబాబు. వాస్తవాలను గ్రహించకుండా, తెలంగాణ ఏర్పాటు చీకటిరోజని మాట్లాడ డం బాధాకరం. విడిపోయి కలుసుందామన్న కేసీఆర్ మాటలు ఇప్పుడు నిజమయ్యాయి.
పరిపాలన చేసే సత్తా లేక చంద్ర బాబు అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు’’ అన్నారు. చేత నైతే అభివృద్ధి, పరిపాలనలో పోటీ పడాలని, కుట్రలు కుతంత్రాల్లో కాదన్నారు. ‘‘చంద్ర బాబు మాటలు పార్లమెంట్‌ను, ప్రజాస్వా మ్యాన్ని అవహేళన చేసేలా ఉన్నాయి. పార్ల మెంట్‌లో ఏకగ్రీవంగా తెలంగాణ బిల్లు ఆమో దం పొందింది. అన్ని పార్టీలు రాష్ట్ర ఏర్పాటు ను ఆమోదించాయి. మీ వెకిలి చేష్టలకు, ప్రలో భాలకు లొంగలేదు. పద్నాలుగు సంవత్స రాల పాటు అన్ని పార్టీలను కలిసిన కేసీఆర్ తొక్కని గడపలేదు.. ఎక్కని మెట్టు లేదు. ఆర్‌ఎస్‌యూ నుంచి ఆరెస్సెస్ వరకూ అంద రినీ ఒప్పించాం.
మాకు బేషజాలు, పంతాలు, రాజకీయాలు లేవు. తెలంగాణ అభివృద్దే లక్ష్యం. విడిపోయిన రెండు సంవత్సరాల్లోనే రెండు రాష్ట్రాలు రెండు లక్షల అరవై వేల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టడమే అందుకు నిదర్శ నం. ఈ వాస్తవాలను మరచిపోయి మాట్లాడ డం దురదృష్టకరం’’ అన్నారు. తెలంగాణ లోనూ చంద్రబాబు వందిమాగధులు అవా కులుచెవాకులు పేలుతూ, ప్రజలను రెచ్చగొ డుతూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు అడ్డుప డుతున్నారని, వారికి తగిన గుణపాఠం తప్ప దని హెచ్చరించారు.
మాది ప్రజా చానల్...
వచ్చే బడ్జెట్‌లో ప్రభుత్వం సంక్షేమానికే పెద్దపీట వేస్తుందని ఈటల తెలిపారు. సబ్ ప్లాన్ నిధులు చట్ట ప్రకారం ఎస్సీ, ఎస్టీ వర్గాల కే ఖర్చు చేసేలా చర్యలు చేపడుతామన్నారు. ఆర్థిక శాఖ గ్రీన్‌చానల్, రెడ్‌చానల్ ద్వారా తమకు అవసరమైన కార్యక్రమాలకే నిధులు కేటాయిస్తోందనే ఆరోపణలను ఈటల తోసిపుచ్చారు. తమకు ప్రజా చానల్ తప్ప ఇతర చానళ్లేమీ లేవని చెప్పారు.
చంద్రబాబు విషం కక్కారు: కవిత
సాక్షి, నిజామాబాద్: టీడీపీ అధినేత చంద్ర బాబు తెలంగాణ విషయంలో మరోసారి విషం కక్కారని నిజామాబాద్ ఎంపీ కె.కవిత విమర్శించారు. ఏపీ అసెంబ్లీ నూతన భవన ప్రారంభోత్సవంలో చంద్ర బాబు మాట్లాడుతూ తెలంగాణపై అనుచి త వ్యాఖ్యలు చేసి తన బుద్ధిని బయట పెట్టుకున్నారన్నారు. ఇందుకు బాధ్యులుగా టీటీడీపీ నేతలు తెలం గాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో టీడీపీని మూసుకోవాలన్నారు.
శుక్రవారం జిల్లా అభివృద్ధి, సమన్వయం, పర్యవేక్షణ కమిటీ సమావేశం కలెక్టరేట్‌లో జరిగింది. అనంతరం కవిత మీడియాతో మాట్లా డారు. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ సమయంలో తెలంగాణను అడ్డుకునేందుకు చంద్ర బాబు కుట్రలు పన్నారన్నారు. ఆంధ్రా ఎమ్మెల్యేలతో రాజీనామా డ్రామాలు ఆడించారన్నారు. ప్రాంతాలుగా విడిపోయినా, ప్రజలుగా కలిసుండాలనే ఉద్దేశంతో తాము ముందుకెళుతున్నామన్నారు. బోర్ల కు జియో ట్యాగింగ్ చేసే విషయం పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. వివిధ పథకాల కింద వచ్చే కేంద్ర నిధుల ను సద్వినియోగం చేసుకుని, అభివృద్ధి పనులు చేపడతామని కవిత చెప్పారు.