
స్టేషన్ మహబూబ్‌నగర్: వచ్చే ఏడాది హజ్‌యాత్రకు ఆసక్తి గల వారు ఈనెల 15నుంచి వచ్చేనెల 7వ తేదీలోపు దర ఖాస్తు చేసుకోవాలని జిల్లా హజ్ సొసైటీ అధ్యక్షుడు మహమూద్‌అలీ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జీవితకాలంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలని ఖురాన్ గ్రంథంలో పేర్కొన్నందున ముస్లింలు ఏటా భారీ సంఖ్యలో పోటీ పడుతున్నారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న ప్రయాణ రాయితీలు, ఇతర వెసులుబాట్లను పొందడానికి దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. యాత్రి కులకు సొసైటీ ఆధ్వర్యంలో అన్నిరకాల సేవలు అందిస్తామని చెప్పారు. సమావేశంలో సొసైటీ కార్యదర్శి సయ్యద్ నయూం, ఖలీల్ అహ్మద్, తాజుద్దీన్, సమద్, ఫైజొద్దీన్, నిజా ముద్దీన్, మునీర్‌ఖాన్, జహంగీర్‌అలీ, రఫీక్, నుస్రత్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment