గతంలో ఉద్యోగం కోల్పోయిన వారికి మళ్లీ అవకాశం
హైదరాబాద్: తెలంగాణలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో కాంట్రాక్టు లెక్చరర్ల నియామకానికి సాంకేతిక విద్యా శాఖ చర్యలు చేపడుతోంది. గతంలో ఏపీపీఎస్సీ ద్వారా పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులకు అభ్యర్థుల నియామకం జరిగినప్పుడు, ఆ స్థానాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లను తొలగించారు. సీనియారిటీతో సంబంధం లేకుండా తమను తొలగించడంపై ఉద్యోగాలు కోల్పోయిన వారు అప్పట్లో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గతంలో పోస్టింగ్‌ల వల్ల నష్టపోయిన వారికి అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రిజర్వేషన్, రోస్టర్ ఆధారంగా కాంట్రాక్టు లెక్చరర్లను నియమించాలని నిర్ణయించింది.
ఏకలవ్య స్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్‌ల ఏర్పాటుకు నిధులు
తెలంగాణ రాష్ట్రంలోని ఆరు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో పెలైట్ పద్ధతిలో క్లాస్-ఎం (కంప్యూటరైజ్డ్ లెర్నింగ్, స్కూల్ సిస్టమ్స్ మేనేజ్‌మెంట్) కంప్యూటర్ ల్యాబ్‌ల ఏర్పాటుకు రూ.1.5 కోట్ల బడ్జెట్‌ను విడుదల చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
త్వరలో పాలిటెక్నిక్ కాంట్రాక్టు లెక్చరర్ల నియామకం
Published Tue, Sep 30 2014 12:39 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 PM
Advertisement