ఆస్తికోసమే హత్య | Astikosame murder | Sakshi
Sakshi News home page

ఆస్తికోసమే హత్య

Published Fri, Nov 7 2014 2:19 AM | Last Updated on Sun, Sep 2 2018 3:44 PM

Astikosame murder

ముస్తాబాద్ :
 ఆస్తి కోసం వరుసకు కొడుకు అయిన యువకుడిని హత్యచేసిన దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. సిరిసిల్ల రూరల్ సీఐ రంగయ్య గురువారం నిందితుల వివరాలు వెల్లడించారు. మద్దికుంట గ్రామానికి చెందిన కదిరె దేవయ్య(30) గత నెల 30 నుంచి కనిపించకుండా పోయాడు. ఆయన కోసం వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో తండ్రి చిన్నలింగం ఈనెల 2వ తేదీన పోలీసులకు ఫిర్యాదుచేశారు.

మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా ఈనెల 4వ తేదీన మద్దికుంట, చీకొడు గ్రామాల మధ్య పాడుబడ్డ బావిలో దేవయ్య మృతదేహం కనిపించింది. విచారణ చేపట్టగా దేవయ్యతో గత నెల 30న వరుసకు చిన్నాన్న అయిన కదిరె సత్తయ్య (50), చిన్నమ్మ భూదవ్వ (48), వీరి కొడుకు వెంకటేశ్(23) పొలం వద్ద ఘర్షణకు దిగారు. ముగ్గురు కలసి దేవ య్య మెడకు నైలాన్ తాడుతో ఉరివేసి చంపారు. తర్వాత సంచిలో దేవయ్య మృతదేహాన్ని సైకిల్‌పై తీసుకెళ్లి ఓ పాడుబడ్డ బావిలో పడేశారు.

 ఆస్తికోసం పంచాయితీ...
 మద్దికుంటకు చెందిన కదిరె చిన్నలింగం, సత్తయ్య, నర్సింహులు అన్నదమ్ములు. నర్సింహులు ముంబాయి వెళ్లి ఆచూకీ లేకుండా పోయాడు. వీరందరికి కలిపి 18 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. నర్సింహులుకు చెందిన ఆరెకరాల భూమి కదిరె దేవయ్య ఆధీనంలో ఉంది. ఇందులోని మూడు ఎకరాలు ఇవ్వాలని సత్తయ్య దేవయ్యతో గొడవపడ్డాడు. పలుమార్లు పంచాయతీ పెట్టాడు.

ఈ క్రమంలోనే  దేవయ్యను హతమార్చారు. నిందితులను గురువారం అరెస్టు చేసినట్లు సీఐ వివరించారు. వెంకటేశ్ పరారీలో ఉన్నాడని చెప్పారు. హత్య ఘటన వెలుగు చూసిన 24 గంటల్లో నిందితులను పట్టుకున్న ఎస్సై మారుతి, హెచ్‌సీ శంకర్, కానిస్టేబుళ్లు మిట్టపల్లి శ్రీధర్, బాల శ్రీనివాస్‌లను సీఐ అభిన

ందించారు.
 నిందితుడిని తప్పించారని ఆందోళన
 హత్య కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు తప్పించారని ఆరోపిస్తూ ముస్తాబాద్ పోలీస్‌స్టేషన్ ఎదుట మద్దికుంట గ్రామస్తులు గురువారం ఆందోళన చేపట్టారు. కదిరె దేవయ్యను భూమి కోసం సొంత చిన్నాన్న, చిన్నమ్మలు కదిరె సత్తయ్య, భూదమ్మ, సోదరుడు కదిరె వెంకటేశం చంపాలేరని, ఇందులో సత్తయ్య అల్లుడు సతీష్ హస్తం ఉందని గ్రామస్తులు ఆరోపించారు.

సత్తయ్య అల్లుడు సతీష్ చంపుతానంటూ బెదిరింపులకు గురిచేశాడని తెలిపారు. దేవయ్య అదృశ్యమైన రోజు సతీష్ గ్రామంలో సంచరించాడని వెళ్లడించారు. దేవయ్యను హత్యచేసేంత శక్తి వృద్ధ దంపతులకు లేదని.. సంచిలో శవం వేసుకుని పాత సైకిల్‌పై ఎలా వెళ్తారని ప్రశ్నించారు. దేవ య్య హత్యపై తండ్రి ఇచ్చిన ఫిర్యాదులో మామ అల్లుళ్లపై అనుమానం వ్యక్తం చేశాడని ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు మల్లయ్య, కదిరె తిరుపతి, పిట్ల రమేశ్, రామచంద్రం, వైకుంఠం, జింక ఎల్లం అన్నారు. 30వ తేదీన మద్దికుంట శివారులో కొంత మంది సంచిరించిన విషయం కూడా గొర్రెలకాపరులు చూశారని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement