![14 ఏళ్లకే డిగ్రీ పూర్తి చేసిన నైనా](/styles/webp/s3/article_images/2017/09/2/71402698231_625x300.jpg.webp?itok=P01MAm-e)
14 ఏళ్లకే డిగ్రీ పూర్తి చేసిన నైనా
కాచిగూడ: టేబుల్ టెన్నిస్‌లో అంతర్జాతీయ క్రీడాకారిణిగా రాణిస్తున్న పద్నాలుగేళ్ల నైనా జైస్వాల్ మరో ఘనత సాధించింది. చిన్న వయస్సులోనే డిగ్రీ పూర్తి చేసింది. శుక్రవారం విడుదలైన తృతీయ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో కాచిగూడలోని కుత్బిగూడకు చెందిన నైనా (హాల్‌టికెట్ నెంబర్: 120911386007) చిన్న వయస్సులోనే డిగ్రీ ఉత్తీర్ణురాలైంది.
నైనా యూసుఫ్‌గూడలోని సెయింట్ మేరీస్ కళాశాలలో బీఏ జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ కోర్సు చేసిం ది. ఆమె టేబుల్ టెన్నిస్‌లో అంతర్జాతీయ క్రీడాకారిణిగా రాణిస్తోంది. నైనా జైస్వాల్ డిగ్రీ ఫైనల్ ఇయర్‌లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించిన సందర్భంగా ఆమె ఇంటివద్ద బంధుమిత్రులు సంబరాలు జరుపుకొన్నారు. పలువురు ఆమెకు పూల బొకేలు అందజేసి, మిఠాయిలు తినిపించి అభినందించారు.