కరీంనగర్ జిల్లా బోయిన్‌పల్లి మండలం కొదురుపాక ఆర్‌అండ్‌ఆర్ కాలనీలోని ఇసుక అక్రమ డంప్‌లపై పోలీసులు ఆదివారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు.
- ఆరు వాహనాలు సీజ్
బోయిన్‌పల్లి
కరీంనగర్ జిల్లా బోయిన్‌పల్లి మండలం కొదురుపాక ఆర్‌అండ్‌ఆర్ కాలనీలోని ఇసుక అక్రమ డంప్‌లపై పోలీసులు ఆదివారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక ప్రొక్లెయినర్, రెండు లారీలు, మూడు ట్రాక్టర్లను సీజ్ చేశారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కొదురుపాక వాగు నుంచి ఇసుక అక్రమంగా తవ్వి ఇక్కడ నిల్వ చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్టు సమాచారం మేరకు వేములవాడ రూరల్ సీఐ మాధవి ఆటోలో సంఘటనా స్థలానికి వెళ్లి ఈ దాడులు నిర్వహించారు.