కరీంనగర్ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఇసుక క్వారీ వద్ద గురువారం అగ్రిప్రమాదం సంభవించింది. దీంతో ఆ ప్రాంతంలోని చెట్లు తగలబడుతున్నాయి. అగ్నికి వాయువు తోడవడంతో.. అగ్నికీలలు భారీగా ఎగసిపడుతున్నాయి. ఇప్పటికే వంద ఎకరాల మేర తాటి చెట్లు పూర్తిగా కాలిపోయాయి. మంటలు వేగంగా వ్యాపిస్తుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.
అగ్ని ప్రమాదంపై స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది... మంటలు అదుపు చేస్తున్నారు. అయితే మంటలు ఎగసిపడుతుండటంతో వాటిని అదుపులోకి తీసుకు వచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.