హైకోర్టు
హైదరాబాద్: తెలంగాణ సర్కార్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్ల కొనసాగింపు రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు వ్యాఖ్యానించింది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని అసహనం వ్యక్తం చేసింది. ఈ రోజు నుంచి మూడు నెలల వరకు స్పెషల్ ఆఫీసర్లు కొనసాగవచ్చునని వెల్లడించింది. ఆలోపు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించడాన్ని సవాల్ చేస్తూ 500 మంది సర్పంచులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. పంచాయతీ కాలపరిమితి ముగిసిన నేపథ్యంలో ఎన్నికలు పూర్తయ్యేంత వరకు సర్పంచ్‌లుగా తమనే కొనసాగించాలని పిటిషనర్లు కోరారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. స్పెషల్ ఆఫీసర్ల కొనసాగింపు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment