సత్తుపల్లి, వైరా, మధిర బీజేపీ అసెంబ్లీ అభ్యర్థులు నంబూరి, రేష్మ, సూర్యారావులను పరిచయం చేస్తున్న దత్తాత్రేయ
ఖమ్మంమామిళ్లగూడెం: పార్టీలు మారేవారికి ఓటు వేయవద్దని మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తా త్రేయ కోరారు. ఆదివారం ఖమ్మం త్రీటౌన్‌లోని హర్షా హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు తమ స్వార్థం కోసం పార్టీలు మారి ప్రజల ను మోసం చేస్తున్నారని విమర్శించారు. నీతిమాలిన చర్యలకు పాల్పడిన వారిని ప్రజలు గమనిస్తున్నారని, వారికి ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదన్నారు. మోడీ చరిష్మాతగ్గుతోందని ప్రచా రం జరుగుతోందని, చనిపోయే పార్టీ కాంగ్రెస్ అయితే, బతికే పార్టీ బీజేపీ అన్నారు. తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్ గ్రాఫ్ తగ్గిందన్నారు. బీజేపీకి ఏ పార్టీతో పొత్తు లేదని, స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌పై వ్యతిరేకత తమకు కొండంత అండ అన్నారు. టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీల అమలులో విఫలమైందన్నారు.
డబుల్ బెడ్‌రూం, దళితులకు 3 ఎకరాల భూమి, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ ఊసే లేకుండా పోయిందన్నా రు. కేసీఆర్ ప్రగతి భవన్‌కు పరిమితం కావటం వల్ల సెక్రెటేరియేట్ మసకబారిపోయిందన్నారు. ప్రతి ఇంటికి నల్లా ఇచ్చిన తరువాతనే ఓట్లు అడుగుతామన్న కేసీఆర్ ఈ ఎన్నికల్లో ఏ మొఖం పెట్టుకొని ప్రజలను ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్‌టీ రామారావును వెన్నుపోటు పొడిచిన ఏపీ సీఎం చంద్రబాబు కాంగ్రెస్‌తో ఎందుకు పొత్తుపెట్టుకున్నారో చెప్పాలన్నారు. ఈ రాష్ట్రంలో ఏ పార్టీ కూడా ఓటు నమోదు కార్యక్రమాన్ని చేపట్టలేదని కానీ బీజేపీ ఆధ్వర్యంలో 18 నుంచి 30 ఏండ్ల వయస్సు ఉన్న వారికి ఓటు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 1 నుంచి 25 వరకు ‘నవయువ సమ్మేళన్’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వచ్చే నెల 3, 4, 5 తేదీలలో రాష్ట్రంలో ముఖ్య నాయకులతో సమా వేశం ఏర్పాటు చేసి నట్లు వివరించారు. వచ్చే నెల మూడవ వారంలో తెలంగాణలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పర్యటన ఉంటుందని చెప్పా రు. పార్టీ జిల్లా అధ్యక్షుడు సన్నె ఉదయ్ ప్రతాప్ మాట్లాడుతూ అందరికి అందుబాటులో ఉన్న కలెక్టరేట్‌ను 12 కిలోమీటర్ల దూరంకు మార్చాలని చూశారని అన్నారు.
వారి ఆస్తులను కాపాడుకోవటానికేనని విమర్శించారు. నిధులు వచ్చినప్పటికి నగరంలోని గోళ్లపాడు చానల్ అభివృద్ధి ఏమా త్రం జరగలేదన్నారు. పాలేరులో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకత ఉందన్నారు. బంగారు తెలంగాణ అంటూ ప్రజలను మోసం చేశారని విమర్శించా రు. 9 నెలల ముందే ఎందుకు అసెంబ్లీ రద్దు చేశారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, కార్యవర్గసభ్యులు గెంటెల విద్యాసాగర్, దొంగల సత్యనారాయణ, ఉప్పల శారద, మట్టా దుర్గాప్రసాద్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్ యాదగిరిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు ప్రభాకర్‌రెడ్డి, నారాయణ, కోశాధికారి డోకుపర్తి రవీందర్‌కుమార్, నాయకులు మల్లుశివరాం, మహిళా మోర్చా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీ దేవీ, మందసరస్వతి, స్వచ్ఛ భారత్ కన్వీనర్ మార్తి వీరభద్రప్రసాద్, యువమోర్చా రాష్ట్ర కార్యవర్గసభ్యులు గోనెల శివ, జిల్లా అధ్యక్షుడు నకిరికంటి వీరభద్రం, ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ ఉపేందర్‌రావు, అసెంబ్లీ కన్వీనర్ మేకల నాగేందర్, నాయకులు ఎం.జనార్ధన్, వీరస్వామి పాల్గొన్నారు.
సత్తుపల్లిటౌన్: కాంగ్రెస్, టీడీపీలు ఎన్నికలో చేతులు కలపటంతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ను కూకటి వేళ్లతో పెకిలించిన ఎన్టీఆర్ ఆత్మఘోషిస్తుందని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. సత్తుపల్లి కళాభారతిలో ఆదివారం రాత్రి సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారం కోసం చంద్రబాబునాయుడు అడ్డదారులు తొక్కుతున్నారని.. రానున్న ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. అనంతరం సత్తుపల్లి, వైరా, మధిర నియోజకవర్గాల అభ్యర్థులు నంబూరి రామలింగేశ్వరరావు, సినీనటి రేష్మారాథోడ్, సూర్యారావులను పరిచయం చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూసంపూడి రవీంద్ర, గెంటల విద్యాసాగర్‌రావు, ఉప్పల శారద, జిల్లా అధ్యక్షులు సన్నె ఉదయ్‌ప్రతాప్, జిల్లా ఇన్‌చార్జ్ యాదగిరిరెడ్డి, టి.వి.రమేష్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు మద్దిశెట్టి సామేలు, మహిళ మోర్చా జిల్లా అధ్యక్షురాలు కొలికిపాక శ్రీదేవి, ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధి సోడపాక నాగేశ్వరరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment