కలెక్షన్ సింగ్
► నోట్లు, నాణేల సేకరణలో ప్రభుత్వ ఉద్యోగి
► ఆర్‌బీఐ విడుదల చేసిన అన్ని నోట్ల కలెక్షన్
► 35 ఏళ్లుగా హాబీ కొనసాగింపు
పోచమ్మమైదాన్ : హన్మకొండలోని బాలసముద్రానికి చెందిన ఠాకూర్ థరమ్‌సింగ్ జిల్లాలోని భూగర్భ జలశాఖలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. గత 35 ఏళ్లుగా ఆయన ఆర్‌బీఐ విడుదల చేసిన కరెన్సీని, నాణేలను సేకరిస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు. రూ. వెయ్యి కరెన్సీ నోటును రూ. 70 వేలకు కొనుగోలు చేసి సేకరించాడంటే ఆయనకు కరెన్సీ కలెక్షన్‌పై ఎంత ఇష్టం ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఆన్‌లైన్‌లో కొనుగోలు..
ఆర్‌బీఐ విడుదల చేస్తున్న కరెన్సీ నోట్లు అన్నీ కూడా తన దగ్గర ఉండాలనే లక్ష్యంతో ధరమ్‌సింగ్ ముందుకు సాగుతున్నారు. 1954లో విడుదల చేసిన రూ.1000 నోట్‌ను ఆయన ఆన్‌లైన్‌లో రూ. 70వేలకు కొనుగోలు చేశారు. అలాగే 1935లో ముద్రించిన రూపాయి నోట్‌ను రూ. 15వేలకు తీసుకున్నారు. కాగా, 1995లో ఆర్‌బీఐ విడుదల చేసిన రూ. 50 కరెన్సీ నోట్లలో ఉన్న చిత్రంలో పార్లమెంట్‌పైన జాతీయ జెండా లేకపోవడంతో వాటిని వెంటనే రద్దు చేసి మళ్లీ విడుదల చేశారు.
అరుుతే తప్పుగా ప్రింట్ అయిన నాలుగు నోట్లను సైతం ఆయన ఆన్‌లైన్‌లో రూ.5 వేల నుంచి రూ. 7వేల వరకు కొనుగోలు చేశారు. ఇదిలా ఉండగా, 1940 డిసెంబర్ 23న ఇంగ్లండ్ నుంచి ఇండియూకు బయలుదేరిన షిప్ సముద్రం మధ్యలో మునిగిపోయింది. అది మళ్లీ 40 సంవత్సరాలకు లభించింది. అందులో ఉన్న ప్రింట్ కాని కరెన్సీ పేపర్లను ఆన్‌లైన్‌లో వేలం ద్వారా విక్రరుుంచారు. ఆ పాటలో ధరమ్‌సింగ్ రూ.5 నోటును రూ.3 వేలకు, రూ.10 నోటును రూ.4 వేలకు కొనుగోలు చేశారు. కాగా, ధరమ్‌సింగ్ కరెన్సీ నోట్ల సేకరణ కోసం ఇప్పటివరకు రూ.20 లక్షలు ఖర్చు పెట్టారు. కలెక్ట్ చేసిన కరెన్సీలను ప్రత్యేక ఫైళ్లలో భద్రంగా దాచిపెడుతున్నారు.
కరెన్సీ కలెక్షన్‌కు ప్రత్యేక గ్రూప్..
దేశ వ్యాప్తంగా కరెన్సీ కలెక్షన్‌కు ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేశారు. అందులో ధరమ్‌సింగ్ సభ్యత్వం తీసుకున్నారు. కాగా, ప్రతి నెల రెండో శుక్ర, శని, ఆదివారాల్లో దేశంలోని పలు నగరాల్లో కరెన్సీ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తుంటారు. ఈ ప్రదర్శనలో ఆర్‌బీఐ విడుదల చేసిన అన్ని నోట్లను ప్రదర్శిస్తుంటారు. ఇందులో కొన్ని నోట్లను విక్రయిస్తుంటారు. ధరమ్‌సింగ్ ఇలా ఎగ్జిబిషన్లలో ఏర్పాటు చేస్తున్న నోట్లను కొనుగోలు చేస్తూ పాఠశాలల్లో ప్రదర్శిస్తూ విద్యార్థులకు కరెన్సీపై అవగాహన కల్పిస్తున్నారు.
ఎక్కడ తయారైందో చెప్పేస్తారు..
ఆర్‌బీఐ ద్వారా వ స్తున్న నాణేలను చూస్తున్న ధరమ్‌సింగ్ వాటిని ఎక్కడ తయారు చేశారనే విషయాన్ని ఇట్టే చెప్పేస్తారు. వాస్తవంగా ఆర్‌బీఐ ద్వారా విడుదలయ్యే నాణేలు హైదరాబాద్, ముంబాయి, కోల్‌కతా, ఢిల్లీ(నోయిడా)లో తయారు చేస్తారు. కాగా, ఈ నాణేల్లో ఉండే గుర్తులను చూసి అవి ఎక్కడ తయారవుతున్నాయో చెప్పే పరిజ్ఞానాన్ని ఆయన సంపాదించారు. కాయిన్‌లో తయారైన సంవత్సరం కింద డైమండ్ ఆకారం ఉంటే ముంబయిలో అని, స్టార్ ఉంటే హైదరాబాద్‌లో అని, డాట్ ఉంటే నోయిడాలో అని, ఏమి లేకుండా ఖాళీగా ఉంటే కోల్‌కతాలో తయారైనట్లుగా గుర్తించి చెబుతారు.
371 నోట్ల సేకరణ..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) 1935 ఏప్రిల్ 1 ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 558 నోట్లను విడుదల చేసింది. అరుుతే అందులో ధరమ్‌సింగ్ 371 కరెన్సీ నోట్లు సేకరించారు. కాగా, ఆర్‌బీఐ ఇప్పటి వరకు రూ. 1, 2, 5, 10, 20, 50, 100, 500, 1000 నోట్లు విడుదల చేసింది.
వరంగల్‌లో కరెన్సీ మ్యూజియం ఏర్పాటు చేస్తా..
నేను గత 35 ఏళ్లుగా నాణేలు, కరెన్సీని సేకరిస్తున్నా. ఆర్‌బీఐ ఆధ్వర్యంలో పర్మనెంట్ కరెన్సీ మ్యూజియం ముంబరుులో నడుస్తుంది. మన వరంగల్‌లో అలాంటి పర్మనెంట్ మ్యూజియంను త్వరలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాను. కరెన్సీ నోట్లపై బ్యాంకు ఉద్యోగులతోపాటు ప్రభుత్వ, ప్రభుత్వతేర సంస్థలు, ఆర్థిక, వ్యాపార, వాణిజ్య సంస్థల్లో పని చేసేవారు రాతలు రాయొద్దు. పాలిమర్ కరెన్సీ వాడకంతో నోట్ల జీవిత కాలం పెరగడమే కాకుండా ముద్రణ ఖర్చు తగ్గడంతో పాటు విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుంది. ఆర్‌బీఐ పాలిమర్ కరెన్సీ వినియోగంలోకి తెవాలి. -ఠాకూర్ ధరమ్‌సింగ్, సూపరింటెండెంట్, జలవనరులశాఖ వరంగల్