
పక్షులకు పండగొచ్చింది. రైతులు ఎక్కడ పొలం దున్నితే అక్కడ వాలి కడుపునింపుకుంటున్నాయి. ప్రస్తుతం పంట సాగు కోసం రైతులు పొలాలను దున్నుతున్నారు. అయితే, దున్నే సమయంలో మట్టిలో ఉండే పేడపురుగులు, ఇతర వ్యర్థాలు భూమిలో నుంచి బయట పడుతుంటాయి. ఆ సమయంలో ఎక్కడెక్కడి నుంచో పక్షులు (కొంగలు) గుంపులు గుంపులుగా పొలాల వద్దకు చేరుకొని వాటిని ఆరగిస్తున్నాయి. ఒక వైపు రైతులు వారి పొలం దున్నే.. వరి నాట్లు వేసే పనుల్లో నిమగ్నమవ్వగా.. పక్షులు తాపీగా పురుగు, పుట్ర తిని ఇతోధికంగా రైతుకు మేలు చేస్తున్నాయి. జిల్లాలోని తెలకపల్లిలో శుక్రవారం కనిపించిన ఈ సుందర దృశ్యాలను ‘సాక్షి’ క్లిక్ మనిపించింది.
– ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్, నాగర్‌కర్నూల్



Comments
Please login to add a commentAdd a comment