
ఘనంగా రామదాసు జయంత్యుత్సవాలు
శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో భక్త రామదాసు 384వ జయంత్యుత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
భద్రాచలం/నేలకొండపలి: శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో భక్త రామదాసు 384వ జయంత్యుత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ఈవో తాళ్లూరి రమేశ్‌బాబు, శ్రీ చక్ర సిమెంట్ అధినేత నేండ్ర గంటి కృష్ణమోహన్, సంగీత విద్వాంసుడు మల్లాది సూరిబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు.
మరోవైపు యాదగిరిగుట్ట (యాదాద్రి) తరహాలోనే భద్రాద్రి అభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నేలకొండపల్లిలోని భక్తరామదాసు ధ్యాన మందిరంలో మూడు రోజుల పాటు జరగనున్న రామదాసు జయంత్యుత్సవాలను మంగళవారం ఆయన ప్రారంభించారు.