కలెక్టర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు | Bhupalpally district collector akunuri murali comments on culture | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

Published Fri, Mar 24 2017 9:12 PM | Last Updated on Tue, Sep 5 2017 6:59 AM

కలెక్టర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

కలెక్టర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

వరంగల్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్రాహ్మణ కల్చర్.. దేవుళ్ల మాలలు.. అడవి మాంసం అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతమైన ఏటూర్ నాగారంలో ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్వకాలంలో మనుషులు అడవి పంది మాంసం తినేవారని.. బ్రాహ్మణ కల్చర్ వచ్చిన తర్వాత ఆహారపు అలవాట్లు మారాయంటూ కామెంట్ చేశారు.

దేవుళ్ల పేరుతో మాలలు వేస్తున్నారని.. ఇప్పుడు ఇది నడుస్తున్నదని చెప్పుకొచ్చారు. అడవి పందులను చంపి హాయిగా తినండని ప్రజలకు పిలుపునిచ్చారు కలెక్టర్ మురళి. తాను ఇప్పటివరకు తినలేదని.. మరోసారి వచ్చినప్పుడు నాకు కూడా ఆ మాంసం పెట్టాలన్నారు. అమెరికాలో అడవి పంది మాంసానికి మంచి డిమాండ్ ఉంటుందని చెప్పుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement