
'బిహార్ ఫలితాల ప్రభావం వరంగల్‌పై ఉండదు'
బీహార్ ఎన్నికల ఫలితాల ప్రభావం వరంగల్ ఉప ఎన్నికపై ఏమాత్రం ఉండబోదని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ పేర్కొన్నారు. బీహార్ రాష్ట్రంలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగానే ఫలితాలు వెలువడ్డాయన్నారు. ఆదివారం ఇక్కడ రమణ విలేకరులతో మాట్లాడారు.
బీహార్ ఫలితాలను ఎన్డీయే సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తమ ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరో బీజేపీ ప్రకటించక పోవడం కూడా ఎన్నికల్లో ప్రభావం చూపించిందన్నారు.