సాక్షి, హైదరాబాద్: దక్షిణాఫ్రికాతో భారత ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకాంక్షించారు. సోమవారం దక్షిణాఫ్రికా పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఉప మంత్రి మ్వన్‌డిలే మసికా సచివాలయంలో జూపల్లితో భేటీ అయ్యారు. దక్షిణాఫ్రికా, తెలంగాణాల మధ్య వ్యాపార, వాణిజ్య రంగాల్లో సహకారంపై చర్చించారు. టీఎస్-ఐపాస్ ద్వారా సింగిల్ విండో పద్ధతిలో వేగంగా పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేస్తున్న విషయాన్ని జూపల్లి ఆయనకు వివరించారు.
పరిశ్రమల ఏర్పాటుకు వచ్చే ఔత్సాహికులకు పలు రాయితీలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మ్వన్‌డిలే మసికా మాట్లాడుతూ దక్షిణాఫ్రికాలో విలువైన ఖనిజ సంపద ఉన్నందున భారత పారిశ్రామిక వేత్తలకు మంచి అవకాశమన్నారు. తెలంగాణలో వ్యాపార అవకాశాలు గుర్తించి ఆయా రంగాల్లో పరస్పర సహకారంతో ముందుకు వెళ్తామని పేర్కొన్నారు.
‘దక్షిణాఫ్రికా-రాష్ట్రం మధ్య వాణిజ్యం బలపడాలి’
Published Tue, Feb 24 2015 3:25 AM | Last Updated on Sat, Sep 2 2017 9:47 PM
Advertisement
Advertisement