
పుట్టిన రోజు నాడే యువకుడి ఆత్మహత్య
శివునిపల్లి(స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్) : ఎంతో సంతోషంగా గడపాల్సిన పుట్టిన రోజునాడు ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని శివునిపల్లిలో సోమవారం సాయంత్రం జరిగింది. కుటుంబ సభ్యుల కథపం ప్రకారం.. శివునిపల్లికి చెందిన నీల తిరుపతి, బుచ్చమ్మ దంపతులకు కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. పెద్ద కుమారుడు నరేష్(23) రెండే ళ్ల క్రితం డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. గత వారం రోజులుగా నరేష్ ముభావంగా ఉంటున్నాడు. సోమవారం ఉదయం తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లగా అతడు ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. అతడి బర్త్‌డే అయినప్పటికీ ఎటూ వెళ్లకుండా ఉంట్లో ఒంటరిగా ఉన్నాడు.
సాయంత్రం ఇంట్లో ఉన్న క్రిమిసంహారక మందు తాగాడు. బయటకు వెళ్లి ఇంటికి వచ్చిన తమ్ముడు ప్రవీణ్ అన్న కిందపడి కొట్టుకుంటుం డడం గమనించి చుట్టుపక్కల వారికి, తల్లిదండ్రులకు సమాచారమిచ్చాడు. వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. మృతదేహంపై పడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిం చారు. ఇంట్లో ఎలాంటి గొడవలు లేవని, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియడం లేదని రోదించారు. కాగా అతడి ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.