ప్రేమ పెళ్లి చేసుకున్న అంధులు | Blind people Love marriag | Sakshi
Sakshi News home page

ప్రేమ పెళ్లి చేసుకున్న అంధులు

Published Mon, May 4 2015 1:56 AM | Last Updated on Wed, Apr 3 2019 4:10 PM

ప్రేమ పెళ్లి చేసుకున్న అంధులు - Sakshi

ప్రేమ పెళ్లి చేసుకున్న అంధులు

నిజామాబాద్‌కల్చరల్ : జిల్లా కేంద్రంలోని కస్బాగల్లి దయానంద్‌మార్గ్‌లో గల ఆర్యసమాజ్‌లో ఆదివారం ఓ ప్రేమ జంట వివాహం చేసుకుంది. వధూవరులిద్దరూ అంధులే. జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌కు చెందిన వరుడు వల్లూర్ రాజశేఖర్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. నగరంలోని ద్వారక అపార్ట్‌మెంట్‌లో నివసించే వధువు పద్మ నగరంలోని సిండికేట్ బ్యాంక్‌లో పర్సనల్ ఆఫీసర్. వీరు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు వీరి వివాహానికి అంగీకరించాయి. దీంతో ఆదివారం ఆర్యసమాజ్ ఇందూరు శాఖ అధ్యక్షుడు ధనాలకోటి వెంకటనర్సయ్య, ప్రధాన కార్యదర్శి దశరథ్, కోశాధికారి దుడుక రామలింగం ఆధ్వర్యంలో ఇరువురి కుటుంబ సభ్యుల మధ్య వివాహం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement