ఏడాదిలోగా బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు పూర్తి | Brahmin vellenla project is complete this year | Sakshi
Sakshi News home page

ఏడాదిలోగా బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు పూర్తి

Published Wed, Apr 6 2016 2:07 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

Brahmin vellenla project is complete this year

 నల్లగొండ రూరల్ : బ్రాహ్మణ వెల్లెంల
 ప్రాజెక్టును ఏడాదిలోగా పూర్తిచేస్తామని సీఎల్పీ
 ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.
 మంగళవారం నల్లగొండ మండలంలోని చందనపల్లి, ముషంపల్లి గ్రామాల్లో ఐకేపీ కేంద్రాలను ప్రారంభించారు.      
 
 నల్లగొండ రూరల్ :  ఏడాదిలోగా బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు పూర్తవుతుందని సీఎల్‌పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని చందనపల్లి, ముషంపల్లి గ్రామాల్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు.  బ్రాహ్మణ వెల్లెంల, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులు పూర్తి చేయాలని సీఎం ను కలిసి విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందిం చారన్నారు. రైతులకు ప్రతిఏటా 10 శాతం గిట్టుబాటు ధర పెంచాలని శాసనసభలో ప్రస్తావించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దైద రజిత వెంకట్‌రెడ్డి, జెడ్పీటీసీ తుమ్మల రాధ లింగస్వామి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మయ్య, సర్పంచ్‌లు లక్ష్మీశైలజ, భిక్షం, నోముల భవాని, రేఖ నాగయ్య, తంగేళ్ల హేమలత వెంకట్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, చింతల భిక్షం, బీరం గోపాల్‌రెడ్డి, తహసీల్దార్ వై.అశోక్‌రెడ్డి, ఏపీఎం పద్మ తదితరులు పాల్గొన్నారు.
 
 ధాన్యానికి మద్దతు ధర పెంచాలి
 తిప్పర్తి : పదేళ్ల నుంచి ఇప్పటి వరకు ధాన్యానికి మద్దతు ధర పెంచకపోవడం రైతులను మోసం చేసినట్లేనని.. వెంటనే మద్దతు ధర పెంచాలని సీఎల్‌పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని రాజుపేట గ్రామపంచాయతీ పరిధిలో గల జొన్నలగడ్డలగూడెంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేలకు, ఇతర ప్రజాప్రతినిధులకు, ఉ ద్యోగులకు జీతాలు పెంచిన ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర పెంచకపోవడం అన్యాయమన్నారు. రాష్ట్రంలో 70శాతానికి పైగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతు కుటుంబాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు.
 
  శ్రీశైలం సొరంగమార్గం, బ్రాహ్మణ వెల్లెంల, పథకాలకు నిధులు కేటాయించడం, ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వకు రూ.400కోట్లతో లైనింగ్ పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతించడం హర్షణీయమన్నారు. కొత్తపల్లి వద్ద 57 ఎకరాలలో బత్తాయి మార్కెట్ పనులను ఈ నెల 20లోపు ప్రారంభించనున్నట్లు తెలిపారు. నియోజవర్గంలో ఇప్పటికి 16ఐకేపీ కేంద్రాలు ప్రారంభమైనట్లు, మరో 25 కేంద్రాలను ప్రారంభించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డీసీసీబీ డెరైక్టర్ పాశం సంపత్‌రెడ్డి, జూకూరు రమేష్, సర్పంచ్ పుల్లెంల సైదులు, కోఆప్షన్ సభ్యుడు అబ్దుల్ రహీం,  కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకట్రామిరెడ్డి, మెరుగు వెంకన్న, అనంతరెడ్డి, మాధవరెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement