లంచం ఇవ్వొద్దు
ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్
మానకొండూర్ : ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో లబ్ధిదారులు ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దని ఏసీబీ డీఎస్సీ సుదర్శన్‌గౌడ్ కోరారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన షాదీ ముబారక్ పథకంలో అవినీతి చోటు చేసుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దీనిపైన సమగ్ర దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మూడు బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టినట్లు చెప్పారు. షాదీ ముబారక్ కోసం 1,912 దరఖాస్తులు రాగా.. 1614 మంజూరయ్యాయని, వివిధ కారణాలతో 270 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. మంజూరైన వాటికి రూ.8.23కోట్లు జమైనట్లు చెప్పారు. ఇంకా రూ.14.98లక్షలు జమ కావాల్సి ఉందన్నారు. విచారణ పేరిట జాప్యం చేస్తే సదరు అధికారిపై చర్య తీసుకోనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా కళ్యాణలక్ష్మి పథకంపై కూడా విచారణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
లంచాలు అడిగితే చెప్పండి
కరీంనగర్ సిటీ : షాదీముబారక్, కల్యాణలక్ష్మి, సబ్సిడీ రుణాల మంజూరులో ఉద్యోగులు, దళారులు లంచాలు అడిగితే తమకు సమాచారం ఇవ్వాలని ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ తెలిపారు. షాదీముబారక్ పథకం లబ్దిదారుల ఎంపికలో వచ్చిన ఆరోపణలపై వరుసగా రెండో రోజు శుక్రవారం విచారణ నిర్వహించారు. మైనార్టీ కార్పొరేషన్, డీటీవో అధికారులను కూడా విచారిస్తామన్నారు. ప్రాథమికంగా అక్రమాలు జరిగాయని లబ్ధిదారులు చెబుతున్నారని పేర్కొన్నారు. సాధ్యమైనంత మేరకు ఎస్‌బీెహ చ్ సేవింగ్ అకౌంట్ ఇవ్వాలన్నారు. లంచాలు అడిగితే 9440446150కు ఎస్‌ఎంఎస్, ఫోన్ చేయొచ్చనిacb krn@gmail.comకు మెయిల్ చేయాలని సూచించారు.