
అవినాష్‌కు ఆయుష్షు పోయరూ..
► కేన్సర్‌తో బాధపడుతున్న బీటెక్ విద్యార్థి
► వైద్యానికి రూ.15 లక్షలు ఖర్చవుతుందంటున్న డాక్టర్లు
► చికిత్స కోసం ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులు
► ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు
గణపురం : ఉన్నత విద్యనభ్యసించి.. మంచి ఉద్యోగం చేయూలని భావించిన ఆ విద్యార్థి కలలు.. కల్లలవుతున్నారు. మాయదారి రోగంతో కుమిలిపోతూ నిత్యం నరకయూతన అనుభవిస్తున్నాడు. అరుుతే కొడుకుకు వచ్చిన జబ్బును నయం చేరుుంచే స్తోమత లేక అమ్మానాన్నలు తల్లడిల్లుతున్నారు. మనసున్న మారాజులు సాయం అందించి తమ కొడుకుకు ప్రాణభిక్ష పెట్టాలని చేతులెత్తి ప్రార్థిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. గణపురం మండలంలోని చెల్పూరుకు చెందిన బిల్లకంటి రాజేశ్వర్‌రావు, మమత దంపతులకు కుమారుడు అవి నాష్‌రావు ఉన్నాడు.
ఈయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ (ఈఈఈ) మూడో సంవత్సరం చదువుతున్నాడు. అయితే మూడు నెలల క్రితం తీవ్ర అస్వస్థత కు గురైన అవినాష్‌రావును తల్లి దండ్రులు హై దరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. కాగా, రిపోర్టులను పరిశీలించిన డాక్టర్లు అవినాష్‌రావును కిమ్స్‌లో చూపించాలని సూచించా రు. దీంతో తల్లిదండ్రులు ఆయనను కిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లి మరోసారి పరీక్షలు చేరుుంచారు. ఈ సందర్భం గా రిపోర్టులు పరిశీలించిన డాక్టర్లు అవినాష్‌రావు కేన్సర్‌తో బాధపడుతున్నాడని.. ప్రస్తుతం అది 4వ స్టేజీ లో ఉన్నట్లుగా స్పష్టం చేయడంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయూరు.
మొదట రూ. 10 లక్షల ఖర్చు..
అవినాష్‌రావు హైదరాబాద్‌లో ఇంటర్ చదువుతున్న సమయంలో ఒకసారి జీబీఎస్ వైరస్‌తో అనారోగ్యం పాల య్యూడు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు ఆయనను యశోద ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేరుుంచారు. ఈ సమయంలో వైద్యానికి రూ. 10 లక్షల వరకు ఖర్చు చేశారు. కాగా, వైద్య ఖర్చుల కోసం తమకు ఉన్న ఆస్తులను వారు అమ్మేశారు. అలాగే అప్పులు కూడా చేశారు.
బతకాలని ఉంది..
నాకు బాగా చదువుకుని ఉన్నత స్థారుుకి ఎదగాలని ఉంది. అందుకే బతకాలని అనుకుంటున్నాను. నాకు కేన్సర్ ఉందని తెలిసినప్పటి నుంచి మా అమ్మానాన్నలు ఎంత బాధపడుతున్నారో మాటల్లో చెప్పలేను. బయూస్పీ, కీమోథెరపీ, మేన్‌మ్యారో, ట్రాన్స్‌లేషన్ చేస్తే తప్పకుండా బతికే అవకాశాలు ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ప్రభుత్వం, దాతలు సాయం అందించి నాకు ప్రాణభిక్ష పెట్టాలి. - బిల్లకంటి అవినాష్‌రావు
కేన్సర్ చికిత్సకు రూ. 15 లక్షలు..
అవినాష్‌రావుకు వైద్యం చేసేందుకు రూ. 15 లక్షల ఖర్చవుతుందని డాక్టర్లు చెబుతుండడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. అయితే అవినాష్‌రావు కు మెరుగైన వైద్యం అందించేందుకు సాయం చేయూలని తల్లిదండ్రులు కొన్ని నెలల క్రితం శాసనసభ స్పీకర్ మధుసూదనాచారిని కలవగా ఆయన సీఎం కా ర్యాలయానికి లేఖ రాశారు. అరుుతే నెలలు గడుస్తున్నా అధికారులు స్పీకర్ లేఖను సీఎం దృష్టికి తీసుకెళ్లడం లేదు.
మానవతావాదులు తమ కుమారుడికి మెరుగైన వైద్యం చేరుుంచేందుకు సాయం అందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. అలాగే ప్రభుత్వం కూడా స్పందించి అవినాష్‌రావుకు ప్రాణభిక్షపెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సాయం చేసే దాతలు 99632-18298, 86888-90883 నంబర్లకు ఫోన్ చేయూలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.