కరీంనగర్‌లో బంద్ ఉద్రిక్తం | bundh in karimnagar distirict | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌లో బంద్ ఉద్రిక్తం

Published Fri, Jul 17 2015 12:27 PM | Last Updated on Sun, Sep 3 2017 5:41 AM

bundh in karimnagar distirict

కరీంనగర్: మున్సిపల్ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా శుక్రవారం వామపక్షాలు చేపడుతున్న తెలంగాణ బంద్‌లో భాగంగా కరీంనగర్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పట్టణంలోని మార్కెట్ రోడ్డులో కాంగ్రెస్ కార్యకర్తలు దుకాణాలు బంద్ చేస్తుండగా.. ఎందుకు బంద్ చేస్తున్నారని ఒక షాపు యజమాని అడగడంతో ఆగ్రహించిన కాంగ్రెస్ కార్యకర్తలు అతని దుకాణంలో ఉన్న సామాగ్రిని బయట పడేసి ఆందోళనకు చేశారు. దీంతో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అరెస్ట్
పారిశుధ్య కార్మికుల సమ్మెకు మద్దతుగా బంద్‌లో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు సీసీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు రాంగోపాల్‌రెడ్డి, ముకుందరెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement