
సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలం శివారులో బస్సు ప్రమాదం జరిగింది. అద్దంకి-నార్కెట్‌పల్లి రహదారిపై ఆర్టీసీ బస్సు అదుపుతప్పి.. పంట పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా కోట్టింది. ఈ బస్సు గుంటూరు జిల్లా పిడుగురాళ్ల డిపోకు చెందినది. హైదరాబాద్ నుంచి పిడుగురాళ్ల వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సులోని ఎనిమిది మంది ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment