ఇంట్లోకే దూసుకొచ్చిన మృత్యువు
రామునిపట్ల (చిన్నకోడూరు) : ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉండే వారికి ఆపద్బాంధవుడిగా జీవం పోసే ఓ ఆర్‌ఎంపీని మృత్యువు ఆర్టీసీ బస్సు రూపంలో కబలించింది. ఈ విషాదకర సంఘటన మండలంలోని రామునిపట్ల గ్రామంలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన మడూరి రాజేశం (50) ఆర్‌ఎంపీగా పనిచేస్తున్నాడు. ఆది వారం తొమ్మిది గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చాడు.
అదే సమయంలో హైదరాబాద్‌కు చెందిన పికెట్ డిపో ఆర్టీసీ గరుడ బస్సు (ఏపీ 29 జెడ్ 2680) కరీంనగర్‌కు వెళుతోం ది. అయితే రామునిపట్ల వద్దకు రాగానే బైక్‌ను తప్పించబోయి అదుపు తప్పి ఆర్‌ఎంపీ రాజేశం నివాసముంటున్న ఇంటి మీదకు దూసుకువచ్చింది. ఈ సంఘటనలో ఇంటి బయట ఉన్న రాజేశంను బస్సు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందా డు. అదేవిధంగా బస్సు డ్రైవర్ మహమూద్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. బస్సులో ఉన్న 25 మంది ప్రయాణికు లు స్వల్పగాయాలతో బయటపడ్డారు.
మృతదేహంతో ఆందోళన..
బస్సు ప్రమాదంలో ఉలిక్కిపడ్డ గ్రామస్తులు రాజేశం మృతదేహాన్ని రాజీవ్ రహదారిపై ఉంచి ఆందోళనకు దిగారు. తగిన నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో కరీంనగర్, హైదరాబాద్ వైపు వెళ్లే వివిధ రకాల వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. దీంతో ఐదు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. విషయం తెలిసిన సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి, సీఐలు ప్రసన్నకుమార్, నాగభూషణంలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బస్సులో ఇరుక్కుపోయిన మహ మూద్‌ను వెలికి తీసేందుకు స్థానికులు, పోలీసులు మూడు గంటల పాటు కష్టపడ్డారు. చేసేది లేక గ్యాస్ కట్టర్‌తో బస్సు ముందు భాగాన్ని కోసి డ్రైవర్‌ను వెలికి తీసి సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు ఆ ందోళనకారులను సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఇందుకు వారు ససేమిరా అనడంతో పోలీసులు ఆర్టీసీ అధికారులతో మాట్లాడారు. వారం రోజుల్లో నష్టపరి హారాన్ని ఇచ్చేందుకు ఆర్టీసీ అధికారులు హామీ ఇచ్చినట్లు పోలీసులు చెప్పడంతో వారు ఆందోళన విరమించారు. ఈ క్ర మంలో ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డితో పాటు ప్రముఖులు ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు.
తప్పిన భారీ ముప్పు...
సాధారణంగా రామునిపట్ల చౌరస్తా వివిధ గ్రామాల ప్రజలతో కిక్కిరిసి ఉం టుంది. అదేగాకుండా ప్రమాదం జరిగి న భవనంలో ఆస్పత్రి ఉండడంతో రో గులు వైద్య పరీక్షలు చేయించుకోవడానికి పెద్ద ఎత్తున వస్తుంటారు. కాగా ప్ర మాదం జరిగిన రోజు ఆదివారం కావ డం, దీనికితోడు గ్రామంలో ప్రజలందరూ బోనాల ఉత్సవానికి ఏర్పాట్లలో ఉండడంతో భారీ ముప్పు తప్పింది.