నగరంలో బయో మెడికల్ రీసెర్చ్ సెంటర్ | cabinet approves for Biomedical Research Centre in hyderabad | Sakshi
Sakshi News home page

నగరంలో బయో మెడికల్ రీసెర్చ్ సెంటర్

Published Thu, Nov 19 2015 1:55 AM | Last Updated on Sun, Sep 3 2017 12:40 PM

cabinet approves for Biomedical Research Centre in hyderabad

రూ. 338.58 కోట్లతో జీనోమ్ వ్యాలీలో ఏర్పాటు
 సాక్షి, న్యూఢిల్లీ:
వైద్య పరిశోధనలకు ఉపయోగపడే జంతువుల ఉత్పత్తి కోసం ప్రత్యేకంగా 'నేషనల్ రీసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయో మెడికల్ రీసెర్చ్'ను ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. కేంద్ర ఆరోగ్య శాఖ పరిధిలోని వైద్య పరిశోధన విభాగం పంపిన ఈ ప్రతిపాదనకు బుధవారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. భారత వైద్య పరిశోధనల మండలి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో రూ. 338.58 కోట్ల అంచనా వ్యయంతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. 2018-19 నాటికి ఇది అందుబాటులోకి రానుంది. అత్యున్నత ప్రమాణాలతో నెలకొల్పే ఈ తరహా కేంద్రం దేశంలోనే మొదటిది. ఈ పరిశోధన కేంద్రం కోసం రాష్ట్ర ప్రభుత్వం జీనోమ్ వ్యాలీలో 102.69 ఎకరాల స్థలాన్ని ఉచితంగా కేటాయించింది.


 'కొత్తవలస-కోరాపుట్ డబ్లింగ్'కు ఆమోదం: కొత్తవలస-కోరాపుట్ రైల్వే లైన్ డబ్లింగ్ పనుల ప్రతిపాదనలకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 189.278 కి.మీ. పొడవైన ఈ మార్గంలో రూ. 2977.64 కోట్ల అంచనా వ్యయంతో డబ్లింగ్ పనులు చేపడ్తారు. దీనివల్ల ఆయా ప్రాంతాల మధ్య సరుకు రవాణా సులభతరమవడంతో పాటు రైల్వే ఆదాయం పెరుగుతుంది. ఈ పనులు వచ్చే ఏడేళ్లలో పూర్తవుతాయని సీసీఈఏ పేర్కొంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement