గాంధీ విగ్రహం వద్ద బైఠాయించి నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ అభ్యర్థి ఖాదర్‌అలీ
సాక్షి, సత్తుపల్లి(ఖమ్మం): పార్టీ టికెట్ రాకపోయే సరికి కొందరు రెబల్స్‌గా నామినేషన్ దాఖలు చేయగా..అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సత్తుపల్లి మున్సిపాలిటీ 11వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్‌ను ఆశిస్తున్న షేక్ ఖాదర్ అలీ శుక్రవారం ఏకంగా మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగడం చర్చనీయాంశంగా మారింది. నామినేషన్ స్క్రూట్నీ తర్వాత అభ్యర్థిని ప్రకటిస్తామని కాంగ్రెస్ నాయకులు సముదాయించారు. 17వ వార్డులో బీజేపీ తరఫున నామినేషన్ వేయకుండా ఊట్ల లక్ష్మీని కిడ్నాప్ చేశారంటూ బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. దీంతో నామినేషన్ కేంద్రం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే ఈ ఆరోపణలను అధికార టీఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఊట్ల లక్ష్మీని ఎవరూ కిడ్నాప్ చేయలేదని, అసలు ఆవిడ వచ్చిందో, లేదో స్పష్టత లేకుంటే ఎలా అని మండిపడుతుంది. చైర్మన్ వార్డులైన 2, 4, 22, 23వ వార్డుల్లో నామినేషన్లు వేసేందుకు ఆసక్తి కనబర్చారు. 16వ వార్డు జనరల్ అయినా బీసీ సామాజిక వర్గం నుంచి టిక్కెట్ కేటాయించే అవకాశాలు కన్పిస్తున్నాయి. సత్తుపల్లి మున్సిపాలిటీలో 23 వార్డులకు గాను మొత్తం 122 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment