పొన్నాల చూసుకుంటరు.. | Caring for the region .. | Sakshi
Sakshi News home page

పొన్నాల చూసుకుంటరు..

Published Mon, Mar 24 2014 3:04 AM | Last Updated on Sat, Sep 2 2017 5:04 AM

పొన్నాల చూసుకుంటరు..

పొన్నాల చూసుకుంటరు..

  • ఎమ్మెల్యే టికెట్‌పై శ్రీధర్ ధీమా
  •      టీపీసీసీ చీఫ్‌తో మాట్లాడిన కొండేటి
  •      సీటుపై గ్యారంటీ ఇచ్చారని వెల్లడి
  •      కలకలం రేపిన ప్రతిపాదిత జాబితా
  •      }ధర్‌కు అన్యాయం జరిగితే సహించమన్న సన్నిహితులు
  •      జాబితాపై నేతల పెదవి విరుపు
  •  సాక్షి ప్రతినిధి, వరంగల్ : సాధారణ ఎన్నికలకు సంబంధించి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రూపొందించిన ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రతిపాదిత జాబితా చర్చనీయాంశంగా మారింది. వర్ధన్నపేట సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ పేరు ఆ జాబితాలో లేకపోవడంపై కాంగ్రెస్‌లో కలకలం రేగింది. కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో ఉన్న ఏకైక దళిత ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్. కింది స్థాయి నుంచి ఎమ్మెల్యే అయిన వ్యక్తిగా శ్రీధర్‌కు గుర్తింపు ఉంది. అన్నింటి కంటే ముఖ్యంగా మొదటి నుంచి పొన్నాల లక్ష్మయ్యకు అనుచరుడిగానే ఉన్నారు.

    పొన్నాల లక్ష్మయ్య తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు అయిన సందర్భంలో మిగలిన వారి కంటే శ్రీధర్ ఎక్కువగా కార్యక్రమాలు నిర్వహించారు. పొన్నాల పీసీసీ అధ్యక్షుడు అయ్యాక శ్రీధర్‌కు టికెట్‌పై భరోసా పెరిగింది. తీరా పీసీసీ జాబితాలో పేరు కనిపించకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. సన్నిహితులతో దీనిపై ఆదివారం ఉదయం చర్చించారు. వెంటనే శ్రీధర్... ఢిల్లీలో ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతో ఫోన్‌లో మాట్లాడారు. ‘శ్రీధర్.. టికెట్ విషయంలో ఆందోళన వద్దు. అది నేను చూసుకుంటాను. ప్రచారం మొదలుపెట్టు.

    ఎంపీటీ సీ, జెడ్పీటీసీల గెలుపు విషయం చూసుకో. టికెట్ల జాబి తాపై ఇబ్బంది లేదు’ అని పొన్నాల తనతో చెప్పారని శ్రీధర్ ‘సాక్షి ప్రతినిధి’కి వివరించారు. సాంకేతిక కారణాలతోనే ముద్రణలో తన పేరు రాలేదని గాంధీభవన్ వర్గా లు చెప్పినట్లు శ్రీధర్ తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడి దగ్గర ఉన్న ప్రతిపాదిత జాబితాలో తన పేరు ఉందని పొన్నాల లక్ష్మయ్య చెప్పారని శ్రీధర్ అన్నారు. ఈ విషయంపై పూ ర్తిగా తెలుసుకునేందుకు సోమవారం ఢిల్లీకి వెళ్తున్నట్లు తెలిపారు.

    ఈ విషయం ఎలా ఉన్నా.. కొండేటి శ్రీధర్ పేరు జాబితాలో లేదనే అంశంపై ఆయన సన్నిహితులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. టికెట్ ఖరారు దశలో ఏదై నా జరిగితే అధిష్టానం నిర్ణయం అనుకునేవాళ్లం గానీ... ప్రతిపాదనల దశలోనే ఇలా చేయడం ఏమిటని కొండేటి సన్నిహితులు అంటున్నారు. అధికారంలోకి వస్తే సామాజిక న్యాయం అంటున్న పార్టీ పెద్ద నేతల ప్రకటనలతో పార్టీకి కలిగే మేలు.. శ్రీధర్ లాంటి వారికి అన్యాయం జరి గితే పోతుందని చెబుతున్నారు.

    తెలంగాణ ప్రదేశ్ కాంగ్రె స్ కమిటీ అధ్యక్షుడు పొన్నాలపై తమకు నమ్మకం ఉంద ని, ఏదైనా కారణంతో శ్రీధర్‌కు అన్యాయం జరి గితే స హించేది లేదని నియోజకవర్గంలోని పలువురు పీఏ సీఎస్ ల చైర్మన్లు సాక్షి ప్రతినిధితో అన్నారు. జాబితా లో పేరు లేకపోవడంతో ఆదివారం నిరసనలు తెలపాలనుకున్నామని.. శ్రీధర్ వారించడంతో ఆగిపోయామని చెప్పారు.
     
    జాబితాపై అసంతృప్తి

     పీసీసీ స్థాయిలో నియోజకవర్గాల వారీగా  తయారు చేసిన జాబితాలో ఒక్కో సీటుకు ఎక్కువ మంది పేర్లు ఉండడంపై కాంగ్రెస్ నేతలు పెదవి విరుస్తున్నారు. ఆశావహులు ఎక్కువగా ఉండడం కాంగ్రెస్‌లో సహజమేనని... పీసీసీ స్థాయిలో వీలైనన్ని తక్కువ పేర్లతో జాబితా రూపొందించాల్సి ఉందని అంటున్నారు. ఇలా కాకుండా రెండుమూడు సెగ్మెంట్లకు మినహాయించి... అన్నింటికీ ఐదారు పేర్లు చేర్చడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పశ్చిమకు 12 పేర్లు ఉండడాన్ని వీరు ప్రస్తావిస్తున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement