kondeti sridhar
-
ఓపెన్ డిగ్రీ అర్హత పరీక్ష రాసిన మాజీ ఎమ్మెల్యే
తొర్రూరు : బీఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఓపెన్ డిగ్రీ ప్రవేశ అర్హత పరీక్షను వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు కొండేటి శ్రీధర్ ఆదివారం రాశారు. తొర్రూరు డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ జూని యర్ కళాశాలలో పరీక్ష రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, ప్రోత్సాహం లేక పూర్తిస్థాయిలో చదువుకోలేకపోయానని, ఇప్పుడు ఉన్నత చదువులు చదివేందుకు ఈ ఓపెన్ డిగ్రీ అర్హత పరీక్షకు హాజరైనట్లు చెప్పారు. -
'నన్నెవరూ కొట్టలేదు.. త్వరలో ఆంధ్రజ్యోతిపై చర్యలు'
కాంగ్రెస్ నాయకుడు వరద రాజేశ్వరరావుతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, ఆయన తనను కొట్టారనడం అవాస్తవమని వరంగల్ జిల్లా వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కొండేటి శ్రీధర్ తెలిపారు. తాను చికిత్స పొందుతున్న ఆస్పత్రి నుంచి ఆయన వివరణ ఇచ్చారు. తాను కొంతమంది నేతల ఒత్తడి తట్టుకోలేకపోయానని ఆయన తెలిపారు. ఆంధ్రజ్యోతి పత్రిక డబ్బుల కోసం వరద రాజేశ్వరరావుపైన, తనపైన ఒత్తిడి తెచ్చిందని, తాను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగానే వాళ్లపై చర్యలు తీసుకుంటానని కొండేటి శ్రీధర్ చెప్పారు. -
'కేసీఆర్‌కు ఇప్పుడు విశ్రాంతే శరణ్యం'
హైదరాబాద్ : టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇచ్చామని, అందుకే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు బ్రహ్మరథం పట్టారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఖాయమని పొన్నాల శనివారమిక్కడ ధీమా వ్యక్తం చేశారు. అయితే గెలుపు టీఆర్‌ఎస్‌దేనంటూ కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. గెలిపిస్తే సేవ... లేకుంటే విశ్రాంతన్న కేసీఆర్‌కు ఇప్పుడిక విశ్రాంతే శరణ్యమని పొన్నాల ఎద్దేవా చేశారు. కొన్ని సెగ్మెంట్లలో కాంగ్రెస్ నేతలు కొందరు పార్టీకి సహకరించలేదన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూలంకషంగా పరిశీలిస్తామన్నారు. ఒత్తిడిని తట్టుకోలేక మాజీ ఎమ్మెల్యే, వర్థన్నపేట కాంగ్రెస్ అభ్యర్థి కొండేటి శ్రీధర్ అస్వస్థతకు గురయ్యారన్నారు. ఆయన ఆత్మహత్యాయత్నం చేయలేదని పొన్నాల తెలిపారు. -
కాంగ్రెస్‌లో కలకలం
హసన్‌పర్తి, న్యూస్‌లైన్ : వర్ధన్నపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొండేటి శ్రీధర్ ఆత్మహత్యాయత్నం కాంగ్రెస్‌లో కలకలం రేపింది. ఎన్నికల సందర్భంగా ప్రత్యర్థి పార్టీలతో మిలాఖత్ అయ్యాడని.. సొంత పార్టీ నాయకులే ప్రచారం చేయడంతో మనస్తాపం చెంది విషగుళికలు మిం గినట్లు అనుచరులు పేర్కొన్నారు. పార్టీ నాయకులు సహకరించకపోవడం వల్లే శ్రీధర్ మానసి క వేదనకు గురయ్యాడని వారు తెలిపారు. అం తేకాక ప్రచారంలో కూడా కొందరు నియోజకవర్గ నాయకులు సైతం కలిసి రాలేదని ప్రచారం జరుగుతోంది. ఇది కూడా ఆత్మహత్యాయత్నానికి ఒక కారణం కావచ్చని అనుచరులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా, శ్రీధర్ తన ప్రత్యర్థి వద్ద నుంచి పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నట్లు నియోజకవర్గంలో మంగళవారం ప్రచారం జరిగింది. దీంతో కలత చెందిన శ్రీధర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటరమణగౌడ్కు ఫోన్ చేసి తన గోడు వినిపించాడు. ఎందుకన్నా... నీవేం భయపడకు.. గెలుపు మనదే. విజయం సాధించిన తర్వాత.. సహకరించని వారికి తగిన గుణపాఠం చెబుతామని వెంకటరమణ భరోసా ఇచ్చారు. ముందుగానే ప్రణాళిక... కొండేటి శ్రీధర్ ఆత్మహత్య చేసుకోవాలని ముం దుగానే ప్రణాళిక రూపొందించుకున్నట్లు స్పష్టమవుతోంది. ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రదేశంలో విషగుళికలు ఉన్న కవర్ లభించింది. పురుగుల మందు కొనుగోలు చేస్తే అనుమానం వస్తుందని భావించిన శ్రీధర్... ఇంట్లో ఉన్న గుళికలను కవర్ లో వేసుకుని అక్కడి నుంచి వంద ఫీట్ల రోడ్డు వద్దకు చేరుకున్నారు. ఎవరికీ అ నుమానం రాకుండా ద్విచక్ర వాహనం ద్వారా బయలుదేరినట్లు తెలుస్తోంది. నిమ్స్‌కు తరలింపు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కాంగ్రెస్ అభ్యర్థి కొండేటి శ్రీధర్‌ను మెరుగై న వైద్యం కోసం సాయంత్రం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించా రు. కొండేటి ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు, ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు. కార్యకర్తల్లో ఆందోళన.. కాగా, శ్రీధర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థే ఆస్పత్రి పాలు కావడంతో నాయకులు, కార్యకర్తలకు ఏమి చేయాలో పాలుపోని పరి స్థితి నెలకొంది. పోలింగ్‌కు ఒక రోజు ముందు తమ నాయకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో వారు ఆందోళనకు గురికావాల్సి వచ్చింది. నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేయాల్సిన తరుణంలో నాయకులు ఎవరిని ఎక్కడ ఏజెంట్లుగా నియమించారో తెలియని పరిస్థితి. జిల్లా నాయకుల సహకారం లభించకపోవడంతోనే తమ అభ్యర్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు కార్యకర్తలు, నాయకులు ఓటర్లకు చెప్పుకొస్తున్నారు. శ్రీధర్‌ను గెలిపిస్తే.. గ్రామానికి కావాల్సిన సౌకర్యాలు సమకూరుస్తామని కార్యకర్తలు హామీ ఇచ్చారు. కాం గ్రెస్ నాయకులు మాత్రం ఓటర్ల వద్ద కు వెళ్లి ఆత్మహత్యయత్నానికి దారి తీసిన కారణాలను వివరిస్తూ... ఓటు వేయాలని విజ్ఞప్తి చేయడం కనిపించింది. -
పొన్నాల చూసుకుంటరు..
ఎమ్మెల్యే టికెట్‌పై శ్రీధర్ ధీమా టీపీసీసీ చీఫ్‌తో మాట్లాడిన కొండేటి సీటుపై గ్యారంటీ ఇచ్చారని వెల్లడి కలకలం రేపిన ప్రతిపాదిత జాబితా }ధర్‌కు అన్యాయం జరిగితే సహించమన్న సన్నిహితులు జాబితాపై నేతల పెదవి విరుపు సాక్షి ప్రతినిధి, వరంగల్ : సాధారణ ఎన్నికలకు సంబంధించి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రూపొందించిన ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రతిపాదిత జాబితా చర్చనీయాంశంగా మారింది. వర్ధన్నపేట సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ పేరు ఆ జాబితాలో లేకపోవడంపై కాంగ్రెస్‌లో కలకలం రేగింది. కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో ఉన్న ఏకైక దళిత ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్. కింది స్థాయి నుంచి ఎమ్మెల్యే అయిన వ్యక్తిగా శ్రీధర్‌కు గుర్తింపు ఉంది. అన్నింటి కంటే ముఖ్యంగా మొదటి నుంచి పొన్నాల లక్ష్మయ్యకు అనుచరుడిగానే ఉన్నారు. పొన్నాల లక్ష్మయ్య తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు అయిన సందర్భంలో మిగలిన వారి కంటే శ్రీధర్ ఎక్కువగా కార్యక్రమాలు నిర్వహించారు. పొన్నాల పీసీసీ అధ్యక్షుడు అయ్యాక శ్రీధర్‌కు టికెట్‌పై భరోసా పెరిగింది. తీరా పీసీసీ జాబితాలో పేరు కనిపించకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. సన్నిహితులతో దీనిపై ఆదివారం ఉదయం చర్చించారు. వెంటనే శ్రీధర్... ఢిల్లీలో ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతో ఫోన్లో మాట్లాడారు. ‘శ్రీధర్.. టికెట్ విషయంలో ఆందోళన వద్దు. అది నేను చూసుకుంటాను. ప్రచారం మొదలుపెట్టు. ఎంపీటీ సీ, జెడ్పీటీసీల గెలుపు విషయం చూసుకో. టికెట్ల జాబి తాపై ఇబ్బంది లేదు’ అని పొన్నాల తనతో చెప్పారని శ్రీధర్ ‘సాక్షి ప్రతినిధి’కి వివరించారు. సాంకేతిక కారణాలతోనే ముద్రణలో తన పేరు రాలేదని గాంధీభవన్ వర్గా లు చెప్పినట్లు శ్రీధర్ తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడి దగ్గర ఉన్న ప్రతిపాదిత జాబితాలో తన పేరు ఉందని పొన్నాల లక్ష్మయ్య చెప్పారని శ్రీధర్ అన్నారు. ఈ విషయంపై పూ ర్తిగా తెలుసుకునేందుకు సోమవారం ఢిల్లీకి వెళ్తున్నట్లు తెలిపారు. ఈ విషయం ఎలా ఉన్నా.. కొండేటి శ్రీధర్ పేరు జాబితాలో లేదనే అంశంపై ఆయన సన్నిహితులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. టికెట్ ఖరారు దశలో ఏదై నా జరిగితే అధిష్టానం నిర్ణయం అనుకునేవాళ్లం గానీ... ప్రతిపాదనల దశలోనే ఇలా చేయడం ఏమిటని కొండేటి సన్నిహితులు అంటున్నారు. అధికారంలోకి వస్తే సామాజిక న్యాయం అంటున్న పార్టీ పెద్ద నేతల ప్రకటనలతో పార్టీకి కలిగే మేలు.. శ్రీధర్ లాంటి వారికి అన్యాయం జరి గితే పోతుందని చెబుతున్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రె స్ కమిటీ అధ్యక్షుడు పొన్నాలపై తమకు నమ్మకం ఉంద ని, ఏదైనా కారణంతో శ్రీధర్‌కు అన్యాయం జరి గితే స హించేది లేదని నియోజకవర్గంలోని పలువురు పీఏ సీఎస్ ల చైర్మన్లు సాక్షి ప్రతినిధితో అన్నారు. జాబితా లో పేరు లేకపోవడంతో ఆదివారం నిరసనలు తెలపాలనుకున్నామని.. శ్రీధర్ వారించడంతో ఆగిపోయామని చెప్పారు. జాబితాపై అసంతృప్తి పీసీసీ స్థాయిలో నియోజకవర్గాల వారీగా తయారు చేసిన జాబితాలో ఒక్కో సీటుకు ఎక్కువ మంది పేర్లు ఉండడంపై కాంగ్రెస్ నేతలు పెదవి విరుస్తున్నారు. ఆశావహులు ఎక్కువగా ఉండడం కాంగ్రెస్‌లో సహజమేనని... పీసీసీ స్థాయిలో వీలైనన్ని తక్కువ పేర్లతో జాబితా రూపొందించాల్సి ఉందని అంటున్నారు. ఇలా కాకుండా రెండుమూడు సెగ్మెంట్లకు మినహాయించి... అన్నింటికీ ఐదారు పేర్లు చేర్చడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పశ్చిమకు 12 పేర్లు ఉండడాన్ని వీరు ప్రస్తావిస్తున్నారు. -
ఆది దేవత సన్నిధిలో ప్రముఖులు
మొక్కులు సమర్పించిన ఎమ్మెల్యే, మంత్రి, చీఫ్‌విప్ మేడారం భక్తులతో కిక్కిరిసిన ఆలయం ములుగు, న్యూస్‌లైన్ : ప్రముఖుల మొక్కులతో ఆదిదేవత గట్టమ్మ ఆలయం కిక్కిరిసింది. శుక్రవారం పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతోపాటు ప్రముఖులు వచ్చి తల్లికి మొక్కులు సమర్పించుకోవడంతో సందడి నెలకొంది. వర్ధన్నపేట ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, ప్రభుత్వ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి సతీసమేతంగా వచ్చి గట్టమ్మకు మొక్కులు చెల్లించారు. మంత్రి పసుపులేటి బాలరాజు, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సోదరుడు రాంచందర్, కుటుంబ సభ్యులు ఆదిదేవతకు మొక్కులు సమర్పించారు. సెక్టోరియల్ అధికారులు నాగేశ్వర్రావు, రమేష్, ఎమ్మార్వో మార్క చక్రధర్ వారికి స్వాగతం పలికారు. ఊహించని విధంగా భక్తులు తరలిరావడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సీఐ శ్రీధర్‌రావు, ఇతర సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. సందడి చేసిన గబ్బర్‌సింగ్ టీం సభ్యులు గబ్బర్‌సింగ్ సినిమా ఫేం హాస్య నటులు సాయిబాబు, నాగులు గట్టమ్మ ఆలయాన్ని సందర్శించి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. మొదటిసారిగా మే డారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకునేందుకు వెళ్తున్నామని, ఇంతమంది భక్తులను చూస్తే ఆశ్చర్యమేస్తోందని వారు అన్నారు. పూజలు చేసిన అనంతరం బయటకి వస్తున్న తరుణంలో వారిని భక్తులు గుర్తుపట్టడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం సందడిగా మారిం ది. వారితో ఫొటోలు దిగేందుకు భక్తులు ఎగబడ్డారు. జనసంద్రంలా.. మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకుని తిరుగు పయనమైన భక్తులు గట్టమ్మ దర్శనానికి ఆగడంతో రద్దీ నెలకొంది. సారలమ్మ గద్దెపైకి వచ్చిన రోజు బుధవారం మేడారం వెళ్లే భక్తుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో జిల్లా కేంద్రం నుంచి వచ్చిన వాహనాలను గుడెప్పాడ్, గణపురం, జంగాలపల్లి మీదుగా జాతరకు మళ్లించిన విషయం తెలిసిందే. దీంతో ఆ రోజు గట్టమ్మను దర్శించుకోలేకపోయిన వారు తిరుగు ప్రయాణంలో గట్టమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అక్కడే విడిది చేసి వంటావార్పులకు సిద్ధమయ్యారు. -
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ లక్ష్యం
కాశిబుగ్గ, న్యూస్‌లైన్ : కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతు సంక్షేమం, అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో రూ.10 కోట్లతో నిర్మించిన 25 వేల మెట్రిక్ టన్నుల గోదాములు, రూ.116.83 లక్షలతో నిర్మించిన ఫైర్‌స్టేషన్, ఇంజిన్, రూ.కోటితో నిర్మించిన సీసీ రోడ్డుతో పాటు మక్కల కొనుగోలుకు ఏర్పాటుచేసిన మార్క్‌ఫెడ్ సెంటర్‌ను ఆయన ఎంపీ రాజయ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌తో కలిసి గురువారం ప్రారంభించారు. ఆ తర్వాత వారు పాలకవర్గం, అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జేసీ పౌసుమి బసు కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో ఆరు కేంద్రాలు జిల్లా రైతాంగానికి ఎంతో ఉపయోగపడాలనే భావనతో మార్కెట్ ఆవరణలో రూ.పది కోట్లతో ఐదు భారీ గోదాములు నిర్మించామని మంత్రి సారయ్య తెలిపారు. ఇంకా మక్క రైతులకు మద్దతు ధర అందేలా రాష్ట్రంలో ఆరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయగా, అందులో ఒకటి జిల్లాకు మంజూరైందని తెలిపారు. అయితే, ఇప్పటికే చాలా మంది రైతులు అమ్ముకున్నారు, కేంద్రం వల్ల ఎవరికి లాభమని విలేకరులు ప్రశ్నించగా.. తమ దృష్టికి రాగానే ఏర్పాటుచేయించామని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తుగానే ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయిస్తామని హామీ ఇచ్చారు. కాగా, గన్నీ సంచుల వ్యవహారం బట్టబయలు చేయాల ని జేసీ పౌసుమి బసును ఆదేశించినట్లు మంత్రి తెలి పారు. ఎంపీ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ జిల్లాలో వ్యాగన్ ఫ్యాక్టరీ నిర్మాణంలో భాగంగా రూ.14 కోట్లు మంజూరయ్యాయని, రూరల్ డెవలప్మెంట్ కింద రోడ్ల మరమ్మతుకు రూ.5 కోట్లు మంజూరైన ఈరోజు శుభదినమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తదితరులను చైర్మన్ మంద వినోద్‌కుమార్‌తో పాటు డెరైక్ట ర్లు సన్మానించారు. కాగా, దడువాయి, గుమస్తా, హమాలీలతో పాటు వివిధ సంఘాల బాధ్యులు మంత్రి సారయ్యను కలిసి తమ సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమాల్లో ఆయా సంఘాల ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, మార్కెట్ డెరైక్టర్లు మార్త శ్యాం సుందర్, పస్తం నర్సింగం, మల్లేశం, శ్రీనివాస్, తాడిశెట్టి విద్యాసాగర్, ఓని భాస్కర్, తత్తరి లక్ష్మణ్, రోకుల భాస్కర్, ఎంబాడి రవీందర్, కేడల జనార్దన్, పద్మ, వేముల నాగరాజు, గుత్తికొండ నవీన్, దూపం సంపత్‌కుమార్, బొజ్జ సమ్మయ్య, కందుకూరి పూర్ణచందర్, రాజబోయిన యాకయ్య, సారయ్య, ఖయ్యూం, కట్కూ రి బాబు, బాదావత్ విజయ్‌కుమార్ పాల్గొన్నారు. తెలంగాణను అడ్డుకోవడం ఎవరితరం కాదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను సీమాంధ్ర ప్రజాప్రతినిధులే కాదు.. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సైతం ఆపలేరని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సార య్య అన్నారు. మార్కెట్‌కు వచ్చిన సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ సీమాంధ్రలో రాజకీయ పెత్తనం కోసం కోసం ఆరాటపడుతున్న చం ద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి తదితరులకు తెలంగాణను అడ్డుకోవడం సాధ్యం కాదనే విషయం తెలుసన్నారు. ఎంపీ రాజయ్య మాట్లాడుతూ సోనియాగాంధీకి తెలంగాణ ప్రజలంతా రుణపడి ఉండాలని కోరారు. మొదటిరోజు 35 క్వింటాళ్లే మార్కెట్‌కు గురువారం 8వేల క్వింటాళ్ల మక్కలు రాగా, కేవలం 35 క్వింటాళ్లు మాత్రమే రూ.1310 చొప్పున మార్కఫెడ్ ద్వారా కొనుగోలు చేశారు. అలాగే, మంత్రి సారయ్య వస్తుండడంతో పత్తి వ్యాపారులు క్వింటాకు రూ.4550 చెల్లించగా, పల్లి యార్డులో మాత్రం జీరో దందా యథావిథిగా సాగింది.