కాంగ్రెస్‌లో కలకలం
హసన్‌పర్తి, న్యూస్‌లైన్ : వర్ధన్నపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొండేటి శ్రీధర్ ఆత్మహత్యాయత్నం కాంగ్రెస్‌లో కలకలం రేపింది. ఎన్నికల సందర్భంగా ప్రత్యర్థి పార్టీలతో మిలాఖత్ అయ్యాడని.. సొంత పార్టీ నాయకులే ప్రచారం చేయడంతో మనస్తాపం చెంది విషగుళికలు మిం గినట్లు అనుచరులు పేర్కొన్నారు. పార్టీ నాయకులు సహకరించకపోవడం వల్లే శ్రీధర్ మానసి క వేదనకు గురయ్యాడని వారు తెలిపారు. అం తేకాక ప్రచారంలో కూడా కొందరు నియోజకవర్గ నాయకులు సైతం కలిసి రాలేదని ప్రచారం జరుగుతోంది. ఇది కూడా ఆత్మహత్యాయత్నానికి ఒక కారణం కావచ్చని అనుచరులు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉండగా, శ్రీధర్ తన ప్రత్యర్థి వద్ద నుంచి పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నట్లు నియోజకవర్గంలో మంగళవారం ప్రచారం జరిగింది. దీంతో కలత చెందిన శ్రీధర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటరమణగౌడ్‌కు ఫోన్ చేసి తన గోడు వినిపించాడు. ఎందుకన్నా... నీవేం భయపడకు.. గెలుపు మనదే. విజయం సాధించిన తర్వాత.. సహకరించని వారికి తగిన గుణపాఠం చెబుతామని వెంకటరమణ భరోసా ఇచ్చారు.
ముందుగానే ప్రణాళిక...
కొండేటి శ్రీధర్ ఆత్మహత్య చేసుకోవాలని ముం దుగానే ప్రణాళిక రూపొందించుకున్నట్లు స్పష్టమవుతోంది. ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రదేశంలో విషగుళికలు ఉన్న కవర్ లభించింది. పురుగుల మందు కొనుగోలు చేస్తే అనుమానం వస్తుందని భావించిన శ్రీధర్... ఇంట్లో ఉన్న గుళికలను కవర్ లో వేసుకుని అక్కడి నుంచి వంద ఫీట్ల రోడ్డు వద్దకు చేరుకున్నారు. ఎవరికీ అ నుమానం రాకుండా ద్విచక్ర వాహనం ద్వారా బయలుదేరినట్లు తెలుస్తోంది.
నిమ్స్‌కు తరలింపు
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కాంగ్రెస్ అభ్యర్థి కొండేటి శ్రీధర్‌ను మెరుగై న వైద్యం కోసం సాయంత్రం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించా రు. కొండేటి ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు, ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు.
కార్యకర్తల్లో ఆందోళన..
కాగా, శ్రీధర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థే ఆస్పత్రి పాలు కావడంతో నాయకులు, కార్యకర్తలకు ఏమి చేయాలో పాలుపోని పరి స్థితి నెలకొంది. పోలింగ్‌కు ఒక రోజు ముందు తమ నాయకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో వారు ఆందోళనకు గురికావాల్సి వచ్చింది. నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేయాల్సిన తరుణంలో నాయకులు ఎవరిని ఎక్కడ ఏజెంట్లుగా నియమించారో తెలియని పరిస్థితి. జిల్లా నాయకుల సహకారం లభించకపోవడంతోనే తమ అభ్యర్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు కార్యకర్తలు, నాయకులు ఓటర్లకు చెప్పుకొస్తున్నారు. శ్రీధర్‌ను గెలిపిస్తే.. గ్రామానికి కావాల్సిన సౌకర్యాలు సమకూరుస్తామని కార్యకర్తలు హామీ ఇచ్చారు. కాం గ్రెస్ నాయకులు మాత్రం ఓటర్ల వద్ద కు వెళ్లి ఆత్మహత్యయత్నానికి దారి తీసిన కారణాలను వివరిస్తూ... ఓటు వేయాలని విజ్ఞప్తి చేయడం కనిపించింది.