కాశిబుగ్గ, న్యూస్‌లైన్ : కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతు సంక్షేమం, అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో రూ.10 కోట్లతో నిర్మించిన 25 వేల మెట్రిక్ టన్నుల గోదాములు, రూ.116.83 లక్షలతో నిర్మించిన ఫైర్‌స్టేషన్, ఇంజిన్, రూ.కోటితో నిర్మించిన సీసీ రోడ్డుతో పాటు మక్కల కొనుగోలుకు ఏర్పాటుచేసిన మార్క్‌ఫెడ్ సెంటర్‌ను ఆయన ఎంపీ రాజయ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌తో కలిసి గురువారం ప్రారంభించారు. ఆ తర్వాత వారు పాలకవర్గం, అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జేసీ పౌసుమి బసు కూడా పాల్గొన్నారు.
రాష్ట్రంలో ఆరు కేంద్రాలు
జిల్లా రైతాంగానికి ఎంతో ఉపయోగపడాలనే భావనతో మార్కెట్ ఆవరణలో రూ.పది కోట్లతో ఐదు భారీ గోదాములు నిర్మించామని మంత్రి సారయ్య తెలిపారు. ఇంకా మక్క రైతులకు మద్దతు ధర అందేలా రాష్ట్రంలో ఆరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయగా, అందులో ఒకటి జిల్లాకు మంజూరైందని తెలిపారు. అయితే, ఇప్పటికే చాలా మంది రైతులు అమ్ముకున్నారు, కేంద్రం వల్ల ఎవరికి లాభమని విలేకరులు ప్రశ్నించగా.. తమ దృష్టికి రాగానే ఏర్పాటుచేయించామని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తుగానే ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయిస్తామని హామీ ఇచ్చారు.
కాగా, గన్నీ సంచుల వ్యవహారం బట్టబయలు చేయాల ని జేసీ పౌసుమి బసును ఆదేశించినట్లు మంత్రి తెలి పారు. ఎంపీ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ జిల్లాలో వ్యాగన్ ఫ్యాక్టరీ నిర్మాణంలో భాగంగా రూ.14 కోట్లు మంజూరయ్యాయని, రూరల్ డెవలప్‌మెంట్ కింద రోడ్ల మరమ్మతుకు రూ.5 కోట్లు మంజూరైన ఈరోజు శుభదినమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తదితరులను చైర్మన్ మంద వినోద్‌కుమార్‌తో పాటు డెరైక్ట ర్లు సన్మానించారు. కాగా, దడువాయి, గుమస్తా, హమాలీలతో పాటు వివిధ సంఘాల బాధ్యులు మంత్రి సారయ్యను కలిసి తమ సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు.
కార్యక్రమాల్లో ఆయా సంఘాల ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, మార్కెట్ డెరైక్టర్లు మార్త శ్యాం సుందర్, పస్తం నర్సింగం, మల్లేశం, శ్రీనివాస్, తాడిశెట్టి విద్యాసాగర్, ఓని భాస్కర్, తత్తరి లక్ష్మణ్, రోకుల భాస్కర్, ఎంబాడి రవీందర్, కేడల జనార్దన్, పద్మ, వేముల నాగరాజు, గుత్తికొండ నవీన్, దూపం సంపత్‌కుమార్, బొజ్జ సమ్మయ్య, కందుకూరి పూర్ణచందర్, రాజబోయిన యాకయ్య, సారయ్య, ఖయ్యూం, కట్కూ రి బాబు, బాదావత్ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
తెలంగాణను అడ్డుకోవడం ఎవరితరం కాదు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను సీమాంధ్ర ప్రజాప్రతినిధులే కాదు.. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సైతం ఆపలేరని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సార య్య అన్నారు. మార్కెట్‌కు వచ్చిన సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ సీమాంధ్రలో రాజకీయ పెత్తనం కోసం కోసం ఆరాటపడుతున్న చం ద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి తదితరులకు తెలంగాణను అడ్డుకోవడం సాధ్యం కాదనే విషయం తెలుసన్నారు. ఎంపీ రాజయ్య మాట్లాడుతూ సోనియాగాంధీకి తెలంగాణ ప్రజలంతా రుణపడి ఉండాలని కోరారు.
మొదటిరోజు 35 క్వింటాళ్లే
మార్కెట్‌కు గురువారం 8వేల క్వింటాళ్ల మక్కలు రాగా, కేవలం 35 క్వింటాళ్లు మాత్రమే రూ.1310 చొప్పున మార్‌కఫెడ్ ద్వారా కొనుగోలు చేశారు. అలాగే, మంత్రి సారయ్య వస్తుండడంతో పత్తి వ్యాపారులు క్వింటాకు రూ.4550 చెల్లించగా, పల్లి యార్డులో మాత్రం జీరో దందా యథావిథిగా సాగింది.
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ లక్ష్యం
Published Fri, Oct 25 2013 2:41 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM
Advertisement
Advertisement