మరో సీనియర్ నేత కాంగ్రెస్ పార్టీకి హ్యాండ్ ఇచ్చారు. మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత బస్వరాజు సారయ్య గులాబీ కండువా కప్పుకున్నారు.
హైదరాబాద్ : మరో సీనియర్ నేత కాంగ్రెస్ పార్టీకి హ్యాండ్ ఇచ్చారు. మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత బస్వరాజు సారయ్య గులాబీ కండువా కప్పుకున్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన సోమవారం టీఆర్ఎస్లో చేరారు. బస్వరాజు సారయ్యతో పాటు వరంగల్ అర్బన్ టీడీపీ అధ్యక్షుడు అనిశెట్టి మురళి, వరంగల్ టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ విద్యాసాగర్ తదితరులు టీఆర్ఎస్లో చేరారు. మరోవైపు బస్వరాజు సారయ్యపై కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది.