
సాక్షి, హైదరాబాద్: రైతులకు పాస్‌పుస్తకాల పంపిణీ కోసం ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈనెల 10 నుంచి చేపట్టనున్న ఈ కార్యక్రమాన్ని ఎండల్లో చేపట్టవద్దని, ఉదయం 7ృ11, సాయంత్రం 5ృ8 గంటల వరకే పాస్‌పుస్తకాలు పంపిణీ చేయాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) మంగళవారం జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆధార్ నంబర్ లేనప్పటికీ రైతులు ఆధార్ నంబర్ వివరాలు తీసుకువస్తే వారి వ్యవసాయ ఖాతా వివరాలను పరిశీలించి చెక్ ఇచ్చేయాలని, ఆ తర్వాత పాస్‌పుస్తకాలపై డిజిటల్ సంతకాలు చేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
కేవలం తప్పుల్లేని పాస్‌పుస్తకాలను మాత్రమే పంపిణీ చేయాలని, ఏ రైతు పాస్‌పుస్తకం ఆ రైతుకు మాత్రమే ఇవ్వాలన్నారు. పాస్‌పుస్తకం ఇచ్చాక రైతు నుంచి సంతకం లేదా వేలిముద్ర తీసుకోవాలని చెప్పారు. గ్రామాల్లోకి వెళ్లే బృందం టీల్యాండ్ పోర్టల్ నుంచి పహాణీని తీసుకుని వెళ్లాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment