కేంద్రం పునరాలోచించుకోవాలి: ఈటెల
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో విలీనమైన 7 మండలాలను తిరిగి తెలంగాణలోనే ఉంచాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది అని ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నకు తెలంగాణ ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ సమాధానం చెప్పారు. ఆంధ్రాలో విలీనమైన 7 మండలాలకు తెలంగాణ సర్కారే విద్యుత్ సరఫరా చేస్తోందని ఆయన తెలిపారు.
జల విద్యుత్ కోసం 7 మండలాలను ఆంధ్రప్రదేశ్ విలీనం చేసుకుందని ఈటెల అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేసిన మండలాల అంశంపై పునరాలోచించుకోవాలని కేంద్రానికి ఈటెల విజ్క్షప్తి చేశారు. కొత్త రేషన్ కార్డుల విధివిధానాలను ఇప్పటికే ప్రకటించారన్నారు. రేషన్ కార్డుల కోసం చేసుకున్న దరఖాస్తులపై పరిశీలన కొనసాగుతోందని ఈటెల రాజేందర్ మరో ప్రశ్నకు సమాధానిమిచ్చారు.