
పక్కదారి పట్టించేందుకే సీఎం సర్వేలు
సాక్షి, హైదరాబాద్: ప్రజల సమస్యలను పరిష్కరించకుండా వారిని పక్కదారి పట్టించేందుకే సీఎం కేసీఆర్ తప్పుడు సర్వేలు తెరపైకి తెచ్చారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. శనివారం మఖ్దూంభవన్‌లో జరిగిన పార్టీ రాష్ట్ర విస్తృత కార్యవర్గసమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలపై తప్పుడు సర్వేలు తెరపైకి తెచ్చి ప్రజలను గందరగోళ పరుస్తున్నారని, సర్వేలను తమకు అనుకూలంగా ప్రకటిం చుకోవడం కేసీఆర్ దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. ధర్నాచౌక్‌ను తరలించడమంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని, దీనిపై ప్రజాసంఘాలతో కలసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.