నర్సంపేట : పట్టణంలోని శాంతినగర్‌లో శుక్రవారం జరుగుతున్న బాల్యవివాహాన్ని చైల్డ్‌లైన్, ఐసీడీఎస్, పోలీసుల ఆధ్వర్యంలో అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై ఇరుకుటుంబాలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. వివరాలిలా ఉన్నాయి. శాంతినగర్‌లోని ఎరుకల కాలనీకి చెందిన ఓ బాలికను గూడూరు వుండలం భూపతిపేటకు చెందిన ఓ యువకుడికి ఇచ్చి వివాహం చేయడానికి పెద్దలు నిశ్చరుుంచారు. ఈ క్రవుంలో చైల్డ్‌లైన్‌కు అందిన సమాచారంతో పెళ్లి జరగకుండా ఆపారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ బాల్య వివాహాలు జరిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటావుని హెచ్చరించారు. విద్యార్థినులకు 18 ఏళ్లు నిండక వుుందే వివాహం చేయడం చట్టరీత్యా నేరవున్నారు. వారు అనేక అనారోగ్యం బారినపడే అవకాశాలు ఉన్నాయున్నారు. బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే పోలీసులకు సవూచారం ఇవ్వాలని సూచించారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్ దెబోరా, చైల్డ్‌లైన్ వలంటీర్ బెజ్జంకి ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.
బాల్య వివాహానికి బ్రేక్
Published Sat, Feb 28 2015 12:49 AM | Last Updated on Wed, Sep 19 2018 8:32 PM
Advertisement