నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి చింతల | chintala ramachandra reddy attends narendra modi's swearing | Sakshi
Sakshi News home page

నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి చింతల

Published Sun, May 25 2014 4:29 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి చింతల - Sakshi

నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి చింతల

హైదరాబాద్: ప్రధాన మంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్రమోడీకి శుభాకాంక్షలు తెలిపేందుకు, ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి శనివారం ఢిల్లీ వెళ్లారు. ఆయన తిరిగి 27వ తేదీన నగరానికి రానున్నారు.  భారత దేశ ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా తాను హాజరుకావడం ఆనందంగా ఉందని ఇది తనకు దేవుడిచ్చిన వరమని చెప్పారు. ఖైరతాబాద్ నియోజక వర్గ ప్రజల తరపున ప్రతినిధిగా ఈ మహత్తర ఘట్టానికి హాజరవుతున్నట్లు చెప్పారు.
 

నరేంద్రమోడీ స్ఫూర్తిగా రాబోయే రోజుల్లో ఖైరతాబాద్‌ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని వెల్లడించారు. ఇటీవలి ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజలు సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయకు 30 వేల మెజారిటీని కట్టబెట్టారంటే నరేంద్రమోడీపై స్థానికులన్న అభిమానానికి ఇది కొలబద్దని చెప్పారు. నియోజక వర్గంలో మంచి అభివృద్ధిని సాధించి నరేంద్రమోడీ లక్ష్యాలకు చేరువ అవుతామని వెల్లడించారు. వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో నియోజకవర్గంలో ఆరు డివిజన్లను గెలుచుకోవడమే లక్ష్యంగా తమ పనితనం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement