రాసలీలల సీఐ, ఎస్ఐ సస్పెన్షన్ | CI, woman SI suspended | Sakshi
Sakshi News home page

రాసలీలల సీఐ, ఎస్ఐ సస్పెన్షన్

Published Wed, Nov 19 2014 10:17 PM | Last Updated on Tue, Nov 6 2018 8:51 PM

రాసలీలల సీఐ, ఎస్ఐ సస్పెన్షన్ - Sakshi

రాసలీలల సీఐ, ఎస్ఐ సస్పెన్షన్

హైదరాబాద్: హైదరాబాద్లోని ఓ లాడ్జిలో రాసలీలలకు పాల్పడుతూ దొరికిపోయిన సీఐ, మహిళా ఎస్ఐల వ్యవహారాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. కరీంనగర్ త్రీటౌన్ సీఐ తొటిచర్ల స్వామి(35), వరంగల్ మహిళా పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ సీహెచ్ రాజ్యలక్ష్మి (30)ని సస్పెండ్ చేశారు. ఇంతకుముందే వీరిద్దరి బదిలీ వేటు వేసిన ఉన్నతాధికారులు తాజాగా కఠిన చర్యలు తీసుకున్నారు.

అసెంబ్లీ సమావేశాల బందోబస్తు కోసం హైదరాబాద్ వచ్చిన సీఐ, మహిళా ఎస్ఐ అబిడ్స్లోని ఓ హోటల్ గదిలో ఉండగా ఎస్ఐ భర్త వారిద్దరినీ పట్టుకున్న సంగతి తెలిసిందే. అధికారులు వారికి వేర్వేరు చోట్ల లాడ్జీల్లో గదులు కేటాయించినా..  సీఐ రాత్రివేళ ఎస్సై గదిలోకి వెళ్లారు. తీరా అదే సమయంలో ఆమె భర్త చెన్నై నుంచి వచ్చి తలుపులు తెరవడంతో సదరు సీఐ పరుగు లంకించుకున్నారు. మహిళా ఎస్సై భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు వారిద్దరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. (ఎస్సైతో సీఐ రాసలీలలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement