లక్కిరెడ్డిపల్లి : వైఎస్ఆర్ కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి సర్కిల్ పోలీసు స్టేషన్‌లో జిల్లా ఎస్పీ నవీన్ గులాటి గురువారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. తనిఖీ నిర్వహించే సమయంలో స్టేషన్ సీఐ వినయ్‌కుమార్ రెడ్డి, ఎస్‌ఐ హుస్సేన్ లేకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో లేకపోవడం, పనితీరు సరిగా లేనందున సీఐ, ఎస్‌ఐలను సస్పెండ్ చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.