
'ఆర్టీసీ సమ్మె విరమణకు చర్యలు'
హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె విరమణకు చర్యలు తీసుకోవాలని మంత్రివర్గ సబ్ కమిటీకి తెలంగాణ సీఎం కేసీఆర్ సూచించారు. ఆర్టీసీని సంరక్షించి, స్వయం సమృద్ధి సాధించే దిశగా కార్యాచరణ ఉండాలని అన్నారు. మంత్రివర్గ ఉపసంఘం సభ్యులతో సోమవారం ఆయన సమావేశమయ్యారు.
కార్మికుల సంక్షేమం, ప్రభుత్వ పరిమితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుని సమ్మె విరమింపజేయాలని ఈ సందర్భంగా సబ్ కమిటీకి సూచించారు. ఉపసంఘంలో జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్ లకు చోటు కల్పించారు. కేసీఆర్ సూచనలతో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరిపారు.