ఉపాధ్యాయ బదిలీలకు సీఎం ఓకే! | CM KCR grinsignal to teacher transfers | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయ బదిలీలకు సీఎం ఓకే!

Published Thu, Jun 11 2015 1:29 AM | Last Updated on Tue, Aug 14 2018 10:51 AM

CM KCR grinsignal to teacher transfers

సాక్షి, హైదరాబాద్: టీచర్ల బదిలీలకు సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. బుధవారం ఆయన సంబంధిత ఫైల్‌పై సంతకం చేసినట్లు తెలిసింది. ఒకట్రెండు రోజుల్లో టీచర్ల హేతుబద్ధీకరణ, పదోన్నతులు, బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ కానున్నాయి. అయితే 14 నుంచే బదిలీల ప్రక్రియను ప్రారంభించేలా షెడ్యూల్ రూపొందించినా.. అందులో కొన్ని మార్పులు చేయనున్నట్లు సమాచారం.

మార్గదర్శకాల్లో స్పష్టత: టీచర్ల బదిలీకి ఎంత కాలాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్న విషయంలో ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది.

ఒకే పాఠశాలలో ఐదేళ్లుగా పనిచేస్తున్నవారికి ‘తప్పనిసరి’ బదిలీ అమలు చేస్తే... 40 వేల మంది టీచర్లను బదిలీ చేయాల్సి వస్తుంది!. దీని వల్ల అనేక సమస్యలు ఏర్పడుతాయి. అయితే సాధారణ బదిలీల నిబంధనల ప్రకారం.. బదిలీకి 5 ఏళ్లను పరిగణనలోకి తీసుకుంటే 20 శాతానికి మించి బదిలీ చేయడానికి వీల్లేదు. దీనిని వర్తింపజేస్తే చాలా తక్కువ మంది బదిలీ అవుతారు. ఇక ఒకే పాఠశాలలో 8 ఏళ్లుగా పనిచేస్తున్న వారికి తప్పనిసరి బదిలీని అమలుచేస్తే... దాదాపు 10 వేల మంది టీచర్లు బదిలీ అవుతారు. అందుకే ప్రభుత్వం ఈ నిబంధన వైపే ఎక్కువగా  మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement