కాలువలే ముందు పూర్తి చేయండి | CM KCR review on irrigation projects | Sakshi
Sakshi News home page

కాలువలే ముందు పూర్తి చేయండి

Published Wed, Jun 21 2017 1:13 AM | Last Updated on Tue, Oct 30 2018 7:50 PM

కాలువలే ముందు పూర్తి చేయండి - Sakshi

కాలువలే ముందు పూర్తి చేయండి

- వచ్చే ఏడాదే కాళేశ్వరం నీటితో చెరువులు నింపాలి: కేసీఆర్‌
- నీటి పారుదల ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి సమీక్ష
- 15 టీఎంసీలతో కొండపోచమ్మకు ఆమోదం


సాక్షి, హైదరాబాద్‌: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో బ్యారేజీలు, రిజర్వాయర్ల కన్నా ముందే కాలువలను పూర్తి చేయాలని.. వచ్చే ఏడాది నుంచే ప్రాజెక్టు పరిధిలోని చెరువుల ద్వారా పంటలకు నీరందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. గతేడాది శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు కాలువల ద్వారా చెరువులు నింపడంతో తొమ్మిది లక్షల ఎకరాల్లో పంటలు పండాయని.. వాటి విలువ రూ.4,725 కోట్లు అని చెప్పారు. అదే స్ఫూర్తితో కాళేశ్వరం కాలువలను వేగంగా నిర్మించి, చెరువులు నింపాలని అధికారులకు సూచించారు.

రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులపై మంగళ వారం ప్రగతి భవన్‌లో సీఎం సమీక్షించారు. మంత్రి హరీశ్‌రావు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషీ, ముఖ్యకార్యదర్శి శాంతి కుమారి, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఇందులో పాల్గొన్నారు. గోదావరి నదిలో ప్రాణహిత, ఇంద్రావతి కలిసిన తరువాత చాలా నీటి లభ్యత ఉందని, రాష్ట్ర వాటా ప్రకారం వాడుకుంటే భవిష్యత్తులో నీటి కొరతే ఉండదని కేసీఆర్‌ స్పష్టంచేశారు. ప్రాజెక్టుల ద్వారా నీరందించలేని ప్రాంతాల్లో చిన్న నీటి వనరులను అభివృద్ధి చేసుకోవాలని అధికారులకు సూచించారు. మొత్తంగా తెలంగాణలో ఏటా రూ.లక్షా 25 వేల కోట్ల విలువైన పంటలు పండుతాయని, ఇది వార్షిక బడ్జెట్‌కు సమానమని చెప్పారు.

15 టీఎంసీలతో కొండపోచమ్మ
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న కొండపో చమ్మ సాగర్‌ నిల్వ సామర్థ్యాన్ని 15 టీఎంసీలకు పెంచిన తరువాత రూపొందించిన డిజైన్లను సీఎం పరిశీలించి ఆమోదించారు. దీనికి వెంటనే టెండర్లు పిలిచి 8 నుండి 10 నెలల సమయంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. తెలంగాణలో కోటి ఎకరాలకు నీరిచ్చేలా ఎత్తిపో తల పథకాల కోసం అవసరమైన విద్యుత్‌ అం దించడానికి ట్రాన్స్‌కో ఏర్పాట్లు చేసిందని తెలి పారు. ఎత్తిపోతల పథకాల విద్యుత్‌ బిల్లులను నీటి పారుదల శాఖ ద్వారా ప్రభుత్వమే చెల్లి స్తుందని చెప్పారు. వ్యవసాయానికి పెట్టే ఖర్చు ను రైతుల కోసం పెట్టే పెట్టుబడిగానే భావిస్తా మన్నారు.

ప్రస్తుతం భారీ ప్రాజెక్టులు నిర్మించే పనిలో ఉన్న నీటి పారుదల శాఖ.. భవిష్యత్తులో ప్రాజెక్టుల నిర్వహణకు అనుగుణంగా సిద్ధం కావాలని సూచించారు. ఈఎన్‌సీ, సీఈలు ఎంతమంది ఉండాలి.. వారెక్కడ పనిచేయాలనే అంశాల్లో స్పష్టత ఉండాలని చెప్పారు. అధికార యంత్రాంగమంతా హైదరాబాద్‌లోనే కేంద్రీ కృతం కాకుండా క్షేత్రస్థాయికి విస్తరించా లన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్ర ప్రాం తానికి అనుకూలంగా అధికారుల వ్యవస్థను ఏర్పాటు చేశారని.. ఇప్పుడు తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులు, 31 జిల్లాలకు అను గుణంగా నీటి పారుదల శాఖ అధికార వ్యవస్థ ఉండాలని పేర్కొన్నారు.

శ్రీశైలం నీటి వినియోగంపై అధ్యయనం చేయాలి
పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో శ్రీశైలం నీటిని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో పూర్తి స్థాయి అధ్యయనం చేయాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు. పాలమూరు ప్రజలు 20 లక్షల ఎకరాలు పండించుకోవాలని ఆకాంక్షించారు. పారిశ్రామిక అవసరాలతో పాటు మిషన్‌ భగీరథ ద్వారా మంచినీరు సరఫరా చేసేందుకు ప్రాజెక్టులో వాటర్‌ లెవల్స్‌ కచ్చితంగా మెయింటెయిన్‌ చేయాలన్నారు. ఇక లిఫ్టుల నిర్వహణకు తగిన ప్రణాళిక రూపొందించాలని, ఇరిగేషన్‌ శాఖలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సూచించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement