సాక్షి,మంచిర్యాల: సింగరేణి ఆత్మీయా సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు కార్మికులపై వరాల జల్లు కురిపించారు. ప్రాణం పోయిన సింగరేణిని ప్రైవేట్ పరం చెయ్యమని సీఎం స్పష్టం చేశారు. సింగరేణి పై సర్వహక్కులు మనకే ఉన్నాయని ఆయన తెలిపారు.
‘100 సంవత్సరాలుగా సింగరేణి సంస్థ అన్నం పెట్టింది. దేశంలో విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్రైవేట్ వాళ్లకు ఇవ్వమని అడిగారు. కానీ మనం ఇవ్వలేదు. ఈ సంస్థలో దాదాపుగా 24వేల మంది ఉద్యోగం చేస్తున్నారు. తెలంగాణ ఏ సంస్థను కూడా ప్రైవేట్ పరం చెయ్యం. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుపుతాం. సింగరేణి క్వార్టర్స్ చూశాను. 1970 సంవత్సరంలో కట్టినవి కాబట్టి కొద్ది వరకు దెబ్బతిన్నాయి. కార్మికుల కోసం 10వేల కొత్త క్వార్టర్స్‌లను కట్టించనున్నాం. కొత్త క్వార్టర్స్ కోసం రూ. 400 కోట్లు కేటాయిస్తున్నామని’ సీఎం కేసీఆర్ అన్నారు.
రేపటి నుంచి కరెంట్, నల్ల బిల్లు ఉండదు..
మాములు ఉద్యోగుల మాదిరే రిటైర్ ఉద్యోగులకు ఉచిత ఆరోగ్య సేవలు అందిస్తామని కేసీఆర్ తెలిపారు. ‘అంతేకాక కార్మికులతో పాటు వారి తల్లిదండ్రులకు వైద్యం అందించడం జరిగింది. వీటితో పాటు 10 లక్షలు వడ్డీలేని రుణం ఇచ్చాము. రాష్ట్రంలో మరో 6 కొత్త గనులను ప్రారంభించడం జరిగింది. ఈ గనుల్లో 4500 మందికి కొత్త ఉద్యోగాలు వస్తాయి. అలియాస్ పేరుతో ఉన్నవారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. వారసత్వ ఉద్యోగులకు హామీ ఇస్తున్న అందరికి అవకాశం వస్తుంది. ఇప్పటి నుంచి కారుణ్య నియామకాలు అని పిలవ్వండి. ఇక నుంచి మీరు ఒక్క రూపాయి లంచం ఇచ్చే అవకాశం ఉండదు. మెడికల్ బోర్డులో నిమ్స్, గాంధీ నుంచి డాక్టర్లు ఉంటారు. మార్చి మొదటి వారంలో మీరు దరఖాస్తు పెట్టుకోండి. యూనియన్ లీడర్స్‌కు లంచాలు ఇవ్వడం బంద్ కావాలి. రెండు మూడు రోజుల్లో సింగరేణి కమిటీ ఏర్పాటు చేస్తామని’ సీఎం తెలిపారు.
లంచం ఆడిగితే పొట్టు పొట్టు తన్నాలి
లంచం అడిగిన వాడ్ని పొట్టు పొట్టు తన్నాలి అని ఆత్మీయా సభలో సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. కార్మిక యూనియన్‌కు ఒక్క రూపాయి రుసుము మాత్రమే ఇవ్వాలని ఆయన అన్నారు. ఇన్‌కమ్ టాక్స్ రద్దు చేయమని శాసనసభలో బిల్లు పెట్టి పంపామని సీఎం తెలిపారు. కానీ కేంద్రం దీనిపై ఎలాంటి చర్య తీసుకోలేదన్నారు. ఈ విషయంపై రాబోయే రోజుల్లో పార్లమెంట్‌లో అడుగుతామని సీఎం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment