atmiya abhinandana sabha
-
జనసేన x టీఢీపీ
గండేపల్లి/గోకవరం/మదనపల్లె/పెడన/బీచ్‌రోడ్డు(విశాఖ తూర్పు)/తుమ్మపాల (అనకాపల్లి జిల్లా) : టీడీపీ–జనసేన ఆత్మియ సమావేశాలు ఇరు పార్టీ నేతల మధ్య అంతరాలను బట్టబయలు చేస్తున్నాయి. ఆ రెండు పార్టీల నేతలకు ఏ దశలోనూ అసలు పొసగడం లేదు. దీంతో ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు బాహాబాహీకి దిగుతూ సమావేశాలను రసాభాసగా మార్చేస్తున్నారు. తాజాగా గురువారం జరిగిన సమావేశాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. ఆ జనసేన నేతకు టికెట్ ఇస్తే మద్దతివ్వం: టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ ప్రతిజ్ఞ టీడీపీ, జనసేన పొత్తు కాకినాడ జిల్లాలో ఆదిలోనే వికటిస్తోంది. ఇటీవల పిఠాపురంలో ఈ రెండు పార్టీల సమావేశం రసాభాసగా ముగియగా, తాజాగా గురువారం జగ్గంపేట నియోజకవర్గ సమావేశానిదీ అదే పరిస్థితి. సమావేశానికి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి జ్యోతుల నెహ్రూ, ఆయన తనయుడు నవీన్‌కుమార్, జనసేన నియోజకవర్గ ఇన్చార్జి పాటంశెట్టి సూర్యచంద్ర, పెద్దాపురం, పిఠాపురం జనసేన పార్టీ ఇన్చార్జిలు తుమ్మల బాబు, తంగెళ్ల ఉదయశ్రీనివాస్ హాజరయ్యారు. గోకవరం మండల జనసేన పార్టీ కన్వినర్ ఉంగరాల మణిరత్నంపై ఇటీవల టీడీపీ నేత గణేష్ దాడి చేసిన అంశాన్ని సమావేశం ప్రారంభంలోనే సూర్యచంద్ర ప్రస్తావించారు. నెహ్రూ ప్రసంగిస్తుండగానే.. దాడి వ్యవహారాన్ని తేల్చాలంటూ పట్టుబట్టారు. జ్యోతుల నవీన్ కలుగజేసుకోవడంతో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. సూర్యచంద్రను నవీన్ గెంటివేయడంతో ఒక్కసారిగా ఇరు పార్టీ శ్రేణులు బాహాబాహీకి దిగాయి. జనసేన టికెట్టు సూర్యచంద్రకు ఇస్తే మద్దతిచ్చేది లేదంటూ జ్యోతుల నెహ్రూ ప్రతిజ్ఞ చేశారు. దీంతో సూర్యచంద్ర, ఆ పార్టీ నాయకులు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. మాకన్నా తక్కువ స్థాయి నేతకు మైక్ ఎలా ఇస్తారు? అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో జరిగిన టీడీపీ–జనసేన ఆత్మియ సమావేశంలో టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యేలు దొమ్మలపాటి రమేష్, షాజహాన్‌బాషా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌చినబాబు హాజరయ్యారు. జనసేన నుంచి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైఫోర్స్ మహేష్, రాయలసీమ కోకన్వినర్ గంగారపు రాందాస్‌చౌదరి, చేనేత విభాగం అధ్యక్షుడు అడపా సురేంద్ర పాల్గొన్నారు. మొదట రాందాస్‌చౌదరి, తర్వాత రమేష్ ప్రసంగించారు. తర్వాత జనసేన తరఫున శివరాం, సురేంద్రకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. దీనిని మైఫోర్స్ మహేష్ తమ్ముడు, అతడి అనుచరులు తీవ్రంగా వ్యతిరేకించారు. తమ నాయకుడికి కాకుండా తమకంటే తక్కువ స్థాయి నాయకుడికి మైక్ ఎలా ఇస్తారంటూ రాందాస్‌చౌదరిపై తిరుగుబాటు చేయడమేగాక.. గొడవకు దిగారు. కాగా, జనసేన మదనపల్లె అభ్యరి్థగా ప్రచారం చేసుకుంటున్న రామాంజనేయులు, దారం అనిత వర్గం సమావేశానికి డుమ్మా కొట్టారు. కుర్చిలతో కుమ్ములాట కృష్ణా జిల్లా పెడనలో సమావేశం జరుగుతుందని టీడీపీ, జనసేన పార్టీలోని కొందరికి సమాచారం వెళ్లింది. మరికొంతమంది ముఖ్య నేతలకు సమాచారం చేరకపోవడంతో.. తమ నాయకుడికి ఎందుకు సమాచారం ఇవ్వలేదని నిలదీసేందుకు టీడీపీలోని మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ వర్గానికి చెందిన కొందరు ఫంక్షన్ హాలుకు చేరుకున్నారు. జనసేన పెడన నియోజకవర్గ ఇన్చార్జిగా ఇటీవల ఉరివి సర్పంచ్ సురేష్‌ను నియమించడం తెలిసిందే. నియోజకవర్గంలో పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు నిర్వహించిన రామ్‌సుదీర్‌ను కాదని వేరే వారికి పదవి ఇవ్వడంపై రామ్సు«దీర్ వర్గీయులు ఆగ్రహంగా ఉన్నారు. టీడీపీ నేతలు జనసేన ఇన్చార్జి సురేష్ వేదికపైకి ఆహ్వనించి కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు యత్నించారు. దీంతో రామ్‌సుదీర్ వర్గీయులు గొడవకు దిగారు. ఆ సమయంలోనే జనసేన జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ సభావేదిక వద్దకు చేరుకున్నారు. సురేష్‌ను ఏ విధంగా పెడనకు ఇన్చార్జిగా నియమించారంటూ రామ్సు«దీర్ వర్గీయులు నిలదీశారు. అక్కడే ఉన్న జనసేనలోని మరో వర్గం వారు కూడా రామ్‌సుదీర్ వర్గంతో గొడవకు దిగడంతో రసాభాసగా మారింది. ఒక వర్గంపై మరో వర్గం వారు కుర్చిలు విసురుకున్నారు. జనసేన వాళ్లు కుమ్ములాడుకుంటున్న సమయంలో టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు సభా వేదిక వద్దకు వచ్చారు. పరిస్థితి చేయి దాటిపోతోందని గమనించి బయటకు వెళ్లిపోయారు. జనసేన రాష్ట్ర నేత పిలిచినా.. డోంట్ కేర్! విశాఖ తూర్పు నియోజకవర్గంలో టీడీపీ, జనసేన పార్టీల ఆత్మియ సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ వచ్చారు. ఆయన రాగానే జనసేన నాయకులు లేచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ పక్కన కుర్చీ వేశారు. అయితే మూర్తియాదవ్ అక్కడ కాకుండా లైన్ చివరిలో కూర్చున్నాడు. సత్యనారాయణ పలుమార్లు పిలిచినా కనీసం ఆయన వైపు కూడా మూర్తియాదవ్ చూడలేదు. టీడీపీ నాయకులు సైతం పిలిచినా ఆయన స్పందించలేదు. జనసేన నేతలకు అధిష్టానం షోకాజ్.. సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని అడిగిన అనకాపల్లి నియోజకవర్గంలోని జనసేన నేతలకు పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీసులిచ్చింది. పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న తమకు షోకాజ్ నోటీసులిచ్చి అవమానించడం అన్యాయమని దూలం గోపీనాథ్, మళ్ల శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. -
యాభై ఏళ్లకు.. ఒక్క చోటకు..
తిమ్మాపూర్(మానకొండూర్): కరీంనగర్ గంజ్ హైస్కూల్లో 1973 బ్యాచ్ పదో తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం మండలంలోని వాగేశ్వరీ ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా జరిగింది. చిన్ననాటి స్మృతులను నెమరేసుకున్నారు. చిన్నపిల్లలుగా వెళ్లినవారు.. మనవలు, మనమరాళ్లను ఎత్తుకుని రావడం ఒకరినొకరు గుర్తుపట్టకపోవడం కనిపించింది. మళ్లీ నూతనంగా పరిచయం చేసుకున్నారు. చాలామంది పూర్వ విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలు చేసి రిటైర్మెంట్ అయ్యారు. కుటుంబసభ్యులతో రోజంతా ఆటాపాటలతో ఆనందంగా గడిపారు. గంజ్ పాఠశాల అభివృద్ధికి తామంతా కృషి చేస్తామని చెప్పారు. 50 ఏళ్ల తర్వాత కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని పూర్వ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. మరణించిన తోటి స్నేహితులు, నాటి ఉపాధ్యాయులకు మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకట్‌రెడ్డి, సత్యనారాయణ, రాజేశం, రవూఫ్, పూర్వ విద్యార్థులు విశ్వనాథ్ బాలకిషన్, చంద్రమౌళి, సత్యం, గౌరిశెట్టి రాజేందర్, ప్రభాకర్, సోమనాథ్, లక్ష్మారెడ్డి, అంజయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
‘లంచం అడిగితే పొట్టు పొట్టు తన్నాలి..’
సాక్షి,మంచిర్యాల: సింగరేణి ఆత్మీయా సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు కార్మికులపై వరాల జల్లు కురిపించారు. ప్రాణం పోయిన సింగరేణిని ప్రైవేట్ పరం చెయ్యమని సీఎం స్పష్టం చేశారు. సింగరేణి పై సర్వహక్కులు మనకే ఉన్నాయని ఆయన తెలిపారు. ‘100 సంవత్సరాలుగా సింగరేణి సంస్థ అన్నం పెట్టింది. దేశంలో విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్రైవేట్ వాళ్లకు ఇవ్వమని అడిగారు. కానీ మనం ఇవ్వలేదు. ఈ సంస్థలో దాదాపుగా 24వేల మంది ఉద్యోగం చేస్తున్నారు. తెలంగాణ ఏ సంస్థను కూడా ప్రైవేట్ పరం చెయ్యం. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుపుతాం. సింగరేణి క్వార్టర్స్ చూశాను. 1970 సంవత్సరంలో కట్టినవి కాబట్టి కొద్ది వరకు దెబ్బతిన్నాయి. కార్మికుల కోసం 10వేల కొత్త క్వార్టర్స్‌లను కట్టించనున్నాం. కొత్త క్వార్టర్స్ కోసం రూ. 400 కోట్లు కేటాయిస్తున్నామని’ సీఎం కేసీఆర్ అన్నారు. రేపటి నుంచి కరెంట్, నల్ల బిల్లు ఉండదు.. మాములు ఉద్యోగుల మాదిరే రిటైర్ ఉద్యోగులకు ఉచిత ఆరోగ్య సేవలు అందిస్తామని కేసీఆర్ తెలిపారు. ‘అంతేకాక కార్మికులతో పాటు వారి తల్లిదండ్రులకు వైద్యం అందించడం జరిగింది. వీటితో పాటు 10 లక్షలు వడ్డీలేని రుణం ఇచ్చాము. రాష్ట్రంలో మరో 6 కొత్త గనులను ప్రారంభించడం జరిగింది. ఈ గనుల్లో 4500 మందికి కొత్త ఉద్యోగాలు వస్తాయి. అలియాస్ పేరుతో ఉన్నవారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. వారసత్వ ఉద్యోగులకు హామీ ఇస్తున్న అందరికి అవకాశం వస్తుంది. ఇప్పటి నుంచి కారుణ్య నియామకాలు అని పిలవ్వండి. ఇక నుంచి మీరు ఒక్క రూపాయి లంచం ఇచ్చే అవకాశం ఉండదు. మెడికల్ బోర్డులో నిమ్స్, గాంధీ నుంచి డాక్టర్లు ఉంటారు. మార్చి మొదటి వారంలో మీరు దరఖాస్తు పెట్టుకోండి. యూనియన్ లీడర్స్‌కు లంచాలు ఇవ్వడం బంద్ కావాలి. రెండు మూడు రోజుల్లో సింగరేణి కమిటీ ఏర్పాటు చేస్తామని’ సీఎం తెలిపారు. లంచం ఆడిగితే పొట్టు పొట్టు తన్నాలి లంచం అడిగిన వాడ్ని పొట్టు పొట్టు తన్నాలి అని ఆత్మీయా సభలో సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. కార్మిక యూనియన్‌కు ఒక్క రూపాయి రుసుము మాత్రమే ఇవ్వాలని ఆయన అన్నారు. ఇన్కమ్ టాక్స్ రద్దు చేయమని శాసనసభలో బిల్లు పెట్టి పంపామని సీఎం తెలిపారు. కానీ కేంద్రం దీనిపై ఎలాంటి చర్య తీసుకోలేదన్నారు. ఈ విషయంపై రాబోయే రోజుల్లో పార్లమెంట్లో అడుగుతామని సీఎం తెలిపారు. -
జీవితంలో క్రమశిక్షణ ఎంతో ముఖ్యం: వెంకయ్య
విజయవాడ: దేశం ముందుకు వెళ్లాలంటే సరైన నాయకత్వం అవసరం అని, అప్పుడే ఆ దేశం శక్తివంతం అవుతుందని ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్య నాయుడు అన్నారు. శనివారం ఉదయం వెంకయ్య నాయుడకు విజయవాడలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ....‘ మోదీ రూపంలో దేశానికి సరైన నాయకుడు దొరికారు.2019లో మోదీ మళ్లీ ప్రధాని కావాలన్నదే నా కోరిక. బీజేపీలో దాదాపు అన్ని పదవులు అనుభవించాను. క్రియాశీలక రాజకీయాల నుంచి నన్ను తప్పించారనడం సరికాదు. Very happy to meet friends, well wishers & party functionaries at a meet & greet organised at The Venue, Vijayawada today pic.twitter.com/w76hTGHvwP — M Venkaiah Naidu (@MVenkaiahNaidu) 29 July 2017 రైతు కుటుంబంలో పుట్టిన నేను చిన్నప్పుడు అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డాను. మా కుటుంబంలో గాంధీ, నెహ్రూలు ఎవరూ లేరు. విజయవాడతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఇక్కడే నాకు నాయకత్వ లక్షణాలు వచ్చాయి. అన్నిరంగాలకు విజయవాడ కేంద్రంగా ఉండేది. ఇక నన్ను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తారని, నా కుటుంబానికి కూడా తెలియదు. జీవితంలో క్రమశిక్షణ ఎంతో ముఖ్యం. విదేశాల్లో ఎవరూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించరు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగించేవే.’ అని అన్నారు. వెన్యూ ఫంక్షన్ హాల్లో జరిగిన ఆత్మీయ అభినందన కార్యక్రమానికి ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, బీజేపీకి చెందిన రాష్ట్రమంత్రులు కామినేని శ్రీనివాసరావు, మాణిక్యాలరావు, ఇతర బీజేపీ రాష్ట్ర నేతలు పాల్గొన్నారు. కాగా, అంతకుముందు ఆయన విమానం ద్వారా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న వెంకయ్యకు....మంత్రులు కామినేని, మాణిక్యాలరావు తదితరులు స్వాగతం పలికారు. -
‘పార్టీని వదులుకున్నాక బాధ కలిగింది’
►పదవుల కోసం ఏనాడూ పాకులాడలేదు ►2020లో రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయం హైదరాబాద్: క్రియాశీల రాజకీయల నుంచి తప్పుకొని ఎన్డీఏ అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి పదవికి పోటీచేస్తున్న వెంకయ్యనాయుడుకు పలువురు రాజకీయ, సినీరంగ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ పార్టీని తల్లిలా భావిస్తానని, పదవుల కోసం తాను ఏనాడూ పాకులాడలేదని, అవే వచ్చాయన్నారు. కేంద్రమంత్రిగా పనిచేస్తున్నప్పుడే పార్టీ తనను జాతీయ ఉపాధ్యక్షుడిని చేసిందని, అలాగే చిన్నతనంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యానని అన్నారు. అమ్మలాంటి పార్టీని వదిలిపెట్టడం బాధగా అనిపించిందన్నారు. ప్రధాని మోదీ నన్ను కన్నీటితో ఓదార్చారన్నారు. 2020లో రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని, పదవిలో ఉండగానే రాజకీయాలు వదిలి సామాజిక సేవలో పాల్గొంటానని వెంకయ్య తెలిపారు. ఇక రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని తన పిల్లలకు ముందే చెప్పానని వెంకయ్య నాయుడు అన్నారు. తన కుమారుడు చేసే వ్యాపారాలు ఏంటో తనకు తెలియదన్నారు. కొంతమంది స్వర్ణభారతి ట్రస్ట్ చేస్తున్న ఆరోపణలు బాధ కలిగించాయని వెంకయ్య పేర్కొన్నారు. Very happy in sharing my thoughts, important events in my life & journey to this position with my friends, well wishers at a meet & greet. pic.twitter.com/qwtct5weCy — M Venkaiah Naidu (@MVenkaiahNaidu) 28 July 2017 కాగా నగరంలో ఏర్పాటు చేసిన వెంకయ్యనాయుడు ఆత్మీయ అభినందన సభకు ఐటీ మంత్రి కేటీఆర్, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, తుమ్మల, మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, చింతల, మాజీ డీజీపీలు రాముడు, దినేష్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డి, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, హీరో వెంకటేష్, నాగార్జున. అల్లు అరవింద్, సుద్దాల అశోక్‌తేజ, మురళిమోహన్, సుజనాచౌదరి, జేపీ తదితరలు పాల్గొన్నారు.