సమాజ హితంతో ముందుకెళ్దాం
- ఓసీ సంక్షేమ సంఘం
- ఐకమత్యమే మన బలం
- పేద విద్యార్థులకు అండగా నిలుద్దాం
సాక్షి, హైదరాబాద్: సమాజ హితమే రెడ్ల లక్షణమని, అనాదిగా వస్తున్న ఈ సంప్రదాయన్ని కొనసాగిద్దామని హోంమంత్రి నాయిని నర్సిం హారెడ్డి అన్నారు. ఓసీ సంక్షేమ సంఘం, రెడ్డి ఐక్య వేదిక సంయుక్త ఆధ్వర్యంలో గురువారం రవీంద్రభారతిలో వివిధ రాజకీయ పార్టీలు, వివిధ రాష్ట్రాల నుంచి ఎన్నికైన రెడ్డిజన లోక్‌సభ, శాసనసభ, శాసనమండలి సభ్యులకు ఆత్మీయ అభినంద సభ నిర్వహించారు. ఈ సం దర్భంగా నాయిని మాట్లాడుతూ అన్ని వర్గాలవారు బాగుంటేనే సమాజం బాగుంటుందన్నారు. ఓసీల్లోనూ పేదలకు అండగా నిలుద్దామన్నారు.
ఏపీ ఐటీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ అందరికీ సామాజిక న్యాయం జరగాల్సి ఉందన్నారు. ఒకప్పుడు బాగున్న ఓసీలు.. రిజర్వేషన్లు లేక ఇబ్బందులు ఎదుక్కొంటున్నారన్నారు. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ గతం ఘనం గా, భవిష్యత్తు ఆందోళనకరంగా ఉందని చెప్పా రు. అనంతరం రెడ్డి ప్రజాప్రతినిధులందరినీ సత్కరించారు.
కార్యక్రమంలో తెలంగాణ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి, తెలంగాణ మంత్రు లు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఏపీ అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సీనియర్ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఎమ్మెల్యేలు అమరనాథరెడ్డి, సి. రామచంద్రారెడ్డి, వై. సాయిప్రసాద్ రెడ్డి, వై. బాలనాగిరెడ్డి, బి.రాజేంద్రనాథ్ రెడ్డి, బి. రాజశేఖర్‌రెడ్డి, జి. శ్రీకాంత్ రెడ్డి, ఆర్.ప్రతాప్ రెడ్డి, జె.వెంకటరెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి. కరుణాకర్‌రెడ్డి, హోలిమేరీ, నలందా గ్రూఫ్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ చైర్మన్ ఎ.వరప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.