సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఈవ్ టీజింగ్, వరకట్నపు హత్యలు, వేధింపులు, లైంగిక దాడులు, హత్యలు, గొలుసు దొంగతనాలు నిత్యకృత్యమయ్యాయి. రోజురోజుకూ నేరాల సంఖ్య పెరుగుతూనే ఉంది. అందుకు తగినట్లుగా ఠాణాలలో మహిళా పోలీసుల సంఖ్య మాత్రం పెరగడం లేదు. మహిళలు మగ పోలీసులతో సమస్యలను చెప్పుకోలేకపోతున్నారు. పోలీస్‌స్టేషన్లకు రావడానికే వెనుకడుగు వేస్తున్నారు.
నిజామాబాద్ క్రైం : జిల్లాలో మహిళా పోలీసుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ప్రతి ఠాణాలో మహిళల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు తప్పనిసరిగా ఒక మహిళా రిసెప్షనిస్టు ఉండాలి. మహిళా సిబ్బంది ఉండాలి. కానీ ఎక్కడా లేడీ కానిస్టేబుళ్లు కనిపించడం లేదు. జి ల్లాలో ఒకే ఒక్క మహిళా ఠాణా ఉంది. అక్కడా సరి పడా సిబ్బంది లేరు. ఉన్నవారికి తగిన సౌకర్యాలు కూడా లేవు. ఎస్‌ఐకి కనీసం వాహనం కూడా లేదు.
సీఐని రెండేళ్ల క్రితం బదిలీ చేశారు. ఆమె స్థానంలో ఇంకెవ్వరినీ నియమించలేదు, దీంతో బాధిత మ హిళలు పోలీసు స్టేషన్లకు రావడానికి జంకుతున్నారు. మగ పోలీసులకు తమ బాధలు చెప్పుకోలేక ఫిర్యాదు చేయడానికే వెనుకాడుతున్నారు. ఏటే టా మహిళలపై అ ఘాయిత్యాలు పెరుగుతునే ఉన్నాయి. నేరాలను అరికట్టడంలో పోలీస్ శాఖ విఫలమవుతోంది. మహిళా పోలీసులు తగి నంత సంఖ్యలో లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. దాంతో కొన్ని సమస్యలు మరుగున పడిపోతున్నాయి.
ఇదీ పరిస్థితి
రాష్ట్ర ప్రభుత్వం గత ఆగస్టు 19న నిర్వహించిన సమగ్ర సర్వే ప్రకారం జిల్లాలో పురుషులు 12,52,192 మంది ఉండగా, మహిళలు 12,99,882 మంది ఉన్నారు. మగవారి కంటే ఆడ వారి సంఖ్యే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇందుకు అనుగుణంగా ఠాణాలలో మహిళా సిబ్బందిని నియమించడంలో పాలకు లు విఫలమవుతున్నారు. అధికారులు కూడా ఈ విషయంలో పెద్దగా దృష్టి సారించడం లేదు. జిల్లాలో మొత్తం 45 పోలీస్‌స్టేషన్లు ఉన్నా యి. 27 ఠాణాలలో నామమాత్రంగా మహిళా సిబ్బంది ఉండగా, 18 ఠాణాలలో ఒక్క మహి ళా పోలీస్ కూడా లేరు. మొత్తంగా 66 మంది సివిల్ మహిళా పోలీసులు, 68 మంది మహిళా హోంగార్డులు అందుబాటులో ఉన్నారు. అంటే ప్రతి తొమ్మిది వేల మహిళా జనాభాకు ఒక పోలీస్ అన్నమాట. మరో 19 మంది శిక్షణలో ఉన్నారు. ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, ఆర్మూర్ సబ్ డివిజన్ల పరిధిలోనే మహిళల కౌన్సెలింగ్ కేంద్రాలు నడుస్తున్నాయి. ఈ కేంద్రాలలో మ హిళా ఎస్‌ఐతోపాటు, మహిళా న్యాయవాది, మహిళా వైద్యురాలు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సమక్షంలో ఫ్యామిలీ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న మహిళ పోలీసులపైనే పనిభారం పడుతోంది. అత్యవసర సమయం లో ఒక్కరోజు కూడా సెలవు దొరకని పరిస్థితి. మహిళా సంఘాలు ధర్నాలు, ఆందోళనలు చేసే సమయంలో వారిని కట్టడి చేసేందుకు నా నా తంటాలు పడవల్సి వస్తోంది. ప్రభుత్వం ఇప్పటికైనా మహిళా ఠాణాలు, పోలీసుల సంఖ్య పెంచాలని పలువురు కోరుతున్నారు.
లేడీ పోలీస్ ఎక్కడ?
Published Sat, Nov 29 2014 2:54 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement