కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డిపై దాడి చేయటం దారుణమని కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డిపై దాడి చేయటం దారుణమని కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. కేసీఆర్ టీఆర్ఎస్ను కట్టడి చేయకపోతే కాంగ్రెస్ క్యాడర్ కూడా తమదైన శైలిలో స్పందిస్తుందని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. టీఆర్ఎస్ దాడులను అరికట్టకపోతే కాంగ్రెస్ శ్రేణులు కూడా అన్ని విధాలుగా సవాల్ చేస్తామని వారు హెచ్చరించారు. పోలీసులు కూడా తమ బాధ్యతలను నిర్వహించకుండా టీఆర్ఎస్ ఏజెంట్లుగా వ్యవహరించటం సరికాదని జానా, భట్టి, షబ్బీర్లు విమర్శించారు.
దాడి హేయమైన చర్య
కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డిపై దాడి హేయమైన చర్య టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అభివృద్ధి పనుల శంకుస్థాపనలో అధికారులు ప్రొటోకాల్ తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు. ఎమ్మెల్యే చిన్నారెడ్డిపై దాడి చేసిన వారిని శిక్షించాలంటూ తమ పార్టీ నేతలతో కలిసి మంగళవారం స్పీకర్ను కలువనున్నట్టు ఆయన తెలిపారు.