గులాబీ రంగు బ్యాలెట్‌ వద్దు | Congress delegation calls on EC for withdrawal of pink ballot papers i | Sakshi
Sakshi News home page

గులాబీ రంగు బ్యాలెట్‌ వద్దు

Published Fri, Nov 23 2018 12:56 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Congress delegation calls on EC for withdrawal of pink ballot papers i - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో గులాబీ రంగు బ్యాలెట్‌ వాడొద్దని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌కు ఏఐసీసీ విన్నవించింది. గురువారం ఈ మేరకు ఆ పార్టీ ప్రతినిధులు ప్రణవ్‌ ఝా, ఎం.ఎ.ఖాన్‌ వినతిపత్రం సమర్పించారు. ‘టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారిక రంగు గులాబీ రంగు. ఆ పార్టీ బ్యానర్లు, జెండా, మేనిఫెస్టో తదితరాలన్నీ పింక్‌ రంగులోనే ఉంటాయి. గులాబీ రంగు ఆ పార్టీని ప్రతిబింబింపజేస్తోంది.

ఈ రంగు బ్యాలెట్‌ టీఆర్‌ఎస్‌కి ప్రయోజనం కలిగిస్తుందనడంలో సందేహం లేదు. ఓటర్లలో గందరగోళం తలెత్తుతుందని ఇటీవల జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నోటా బటన్‌ గులాబీ రంగులో ఉండటంపై టీఆర్‌ఎస్‌ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి మీకు తెలుసు. అందువల్ల ఈ అంశాన్ని ఈసీఐ గుర్తించి పరిష్కరిస్తుందని ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు. పింక్‌ బ్యాలెట్‌ వినియోగంపై అభ్యంతరం తెలుపుతూ తెలంగాణ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ఈ నెల 12న లేఖ రాసినా తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి పరిగణనలోకి తీసుకోలేదన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement