మెడలు వంచైనా హామీలు అమలుచేయిస్తాం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క మండిపడ్డారు. తనను తాను హిట్లర్‌తో పోల్చుకుంటూ ప్రతిపక్షాల మీద కేసీఆర్ దుర్భాషలాడుతున్నారని ఆయన అన్నారు. కేసీఆర్ మెడలు వంచైనా ఆయన ఇచ్చిన హామీలు అమలు చేయిస్తామని చెప్పారు. రుణమాఫీ విషయంలో బాండ్లు ఇవ్వాల్సింది రైతులకు కాదు.. బ్యాంకులకని ఆయన అన్నారు. అప్పుడే ఇచ్చిన హామీ అమలయినట్లు అవుతుందన్నారు.
రైతు రుణమాఫీ విషయంలో మాట మార్చినందుకు టీఆర్ఎస్ దిమ్మెలను ఆ పార్టీ కార్యకర్తలే కూల్చారని తెలిపారు. కేసీఆర్ సర్కారు ఎప్పుడు కూలిపోతుందో తెలియదని ఆయన జోస్యం చెప్పారు. రుణమాఫీ కోసం రైతులు మూడేళ్ల పాటు ఆగలేరని, రైతు రుణాలను ప్రభుత్వ రుణాలుగా మార్పించాలని సూచించారు. హామీల అమలుపై సీఎం కేసీఆర్ అందరికీ స్పష్టత ఇవ్వాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.