హైదరాబాద్ : టీఆర్ఎస్లోకి వలసల జోరు కొనసాగుతోంది. నిన్న టీడీపీ నేతలు కారెక్కితే...తాజాగా కాంగ్రెస్ నేతలు కూడా గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ...కేసీఆర్తో భేటీ అయ్యారు.
చేవెళ్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే యాదయ్య గురువారం ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. మంత్రి హరీష్ రావు వెంట ...ఆయన క్యాంపు కార్యాలయానికి వచ్చారు. మరోవైపు వరంగల్ జిల్లా డోర్నకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్, ఆయన కుమార్తె, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే కవిత కూడా కేసీఆర్తో భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్ చేతిలో ఆమె ఓటమి పాలైంది.
కేసీఆర్తో కవిత, ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీ
Published Thu, Oct 30 2014 12:29 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement